ASBL Koncept Ambience

న్యూజెర్సీ, బోస్టన్‌లలో నరేన్ టీం ప్రచారం

న్యూజెర్సీ, బోస్టన్‌లలో నరేన్ టీం ప్రచారం

తానా ప్రస్తుత ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడుతున్న నరేన్‌ కొడాలి, ఆయన బృందం సభ్యులు న్యూజెర్సి, బోస్టన్‌లలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌ గోదావరిలో జరిగిన కార్యక్రమంలో నరేన్‌ ప్యానెల్‌లో పోటీలో ఉన్న రవి పొట్లూరి, మందలపు రవి, అద్దంకి పద్మలక్ష్మీ, సతీష్‌ తుమ్మల, ఫౌండేషన్‌ ట్రస్టీ విద్యా గారపాటి, మాజీ అధ్యక్షుడు గంగాధర్‌ నాదెళ్ల తదితరులు పాల్గొని స్థానిక ప్రవాసులతో సమావేశమై తమ టీమ్‌ విజయానికి మద్దతు అందించాలని కోరారు.

తానా మాజీ అధ్యక్షుడు గంగాధర్‌ నాదెళ్ళ మాట్లాడుతూ, నరేన్‌ టీమ్‌ను గెలిపించాలని కోరారు. గత ఆరు సంవత్సరాలుగా పాఠశాల ద్వారా విద్యార్థులకు తెలుగు బోధించడానికి నిర్విరామ కృషి చేస్తున్న పద్మలక్ష్మి అద్దంకి న్యూజెర్సీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ గా పోటీ చేయడానికి ముందుకు రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. మహిళలు అన్నీ రంగాల్లో రాణిస్తున్నట్లే సమాజసేవ చేస్తూ తానా లాంటి సంస్థ ద్వారా తెలుగు కమ్యూనిటీ కి సేవ చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా శ్రీపద్మలక్ష్మి న్యూ జెర్సీ తానా సభ్యులకు విజ్ఞప్తి చేసారు. తరువాత బోస్టన్‌ తానా సభ్యులతో నరేన్‌ సమావేశమయ్యారు. తాము గెలిస్తే తానాకు కొత్త రూపం తీసుకురావడంతోపాటు మీకు మరింతగా సేవలందిస్తామని చెబుతూ, తమను గెలిపించాలని కోరారు.

Click here for Photogallery

 

Tags :