నార్త్ కరోలినాలో నరేన్ కొడాలి టీమ్‌కు ఘనస్వాగతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. పోటాపోటీగా అభ్యర్థులు వివిధ నగరాల్లో ప్రచారాన్ని చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నరేన్ కొడాలి తన టీమ్‌తో కలిసి నార్త్‌కరోలినాలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా సభ్యులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానాతో తనకు ఉన్న అనుబంధం, తన పనితీరు, వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం చూసి తనను గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే తానాను సరైన పంథాలో నడిపించడంతోపాటు, తానా ప్రతిష్టను మరింతగా పెంచుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, సతీష్ వేమన, రవిపొట్లూరి, భక్తబల్లా, లోకేష్ నాయుడు, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల, సత్యనారాయణ మన్నె తదితరులు పాల్గొన్నారు.
Tags :