ASBL Koncept Ambience

తానా ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నరేన్ కొడాలి టీమ్

తానా ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నరేన్ కొడాలి టీమ్

వైస్‌ ప్రెసిడెంట్‌గా నరేన్‌ కొడాలి, కార్యదర్శిగా రాజా కసుకుర్తి ఎన్నిక

ఇటీవల జరిగిన తానా ఎన్నికల్లో వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ చేసిన నరేన్‌ కొడాలి 3వేల ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని అందుకున్నారు. దానికితోడు ఆయన టీమ్‌ తరపున పోటీ చేసిన ఇసి సభ్యులు, బోర్డ్‌ సభ్యులు కూడా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. తానా ఎన్నికల చరిత్రలో ఒకే టీమ్‌ మొత్తం ఇంత పెద్దఎత్తున విజయాన్ని సాధించడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు. 

అనూహ్య మలుపులతో రెండేళ్లపాటు కొనసాగిన ‘తానా’ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికల్లో నరేన్‌ కొడాలి టీమ్‌ ఘన విజయం సాధించింది. తదుపరి తానా అధ్యక్షుడిగా వర్జీనియాకు చెందిన నరేన్‌ కొడాలి గెలుపొందారు. సుమారు మూడు వేల ఓట్ల ఆధిక్యంతో సతీష్‌ వేమూరిపై ఆయన విజయం అందుకున్నారు.

ఈ ఎన్నికల్లో మొదటి నుంచే నరేన్‌ కొడాలి విజయమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు తానా సభ్యులతో తన భావాలను, చేయనున్న కార్యక్రమాలను పంచుకుంటూ తనతోపాటు టీమ్‌ విజయానికి బాటలు వేశారు. అపజయాలకు వెరవకుండా, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న నరేన్‌ కొడాలి తన గెలుపుకోసం సీనియర్లను కలుపుకుని వెళ్ళి అఖండ విజయాన్ని అందుకున్నారు.  తమ వర్గ ముఖ్య నాయకుల తోడ్పాటును నిలుపుకోవడంతోపాటు ఆద్యంతమూ అనేక నగరాలు పర్యటిస్తూ అనేకమంది మద్దతును ఆయన కూడగట్టారు.  ముఖ్యమైన అట్లాంటా లావు వర్గంతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ వరకు కలిసి ఐకమత్యంతో గెలుపునకు ప్రయత్నించి సఫలమయ్యారు.  కీలక దశలో తన పూర్వ ప్రత్యర్థి మరియు సీనియర్‌ అయిన శ్రీనివాస గోగినేని ఇంటికి స్వయంగా వెళ్లి, మద్దతు కోరి సాధించుకొని వెంటనే అదే స్పూర్తితో పూర్వ అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేనిని బోస్టన్‌లో కలిసి మద్దతు పొందడం ఈ ఎన్నికల్లో మరో ముఖ్య పరిణామంగా నిలిచింది. అలాగే తానా మాజీ అధ్యక్షులు, టీడీపీ ఎన్నారై ప్రముఖులు జయరాం కోమటి,  గంగాధర్‌ నాదెళ్ల, సతీష్‌ వేమన, అంజయ్య చౌదరి లావులు కూడా నరేన్‌ కొడాలికి మద్దతుగా నిలిచారు.  టీం కొడాలి విజయానికి పోటీలో ఉన్న లావు శ్రీనివాస్‌, రవి పొట్లూరి, రాజా కసుకుర్తి ప్రత్యక్షంగా ముఖ్య భూమిక పోషించగా, అదే ప్యానెల్‌ సభ్యులైన భక్త బల్లా, వెంకట్‌ కోగంటి, సునీల్‌ పాంత్రా, లోకేష్‌ నాయుడు, ఠాగూర్‌ మలినేని, సతీష్‌ కొమ్మన, నాగ పంచుమర్తి, శ్రీనివాస్‌ కూకట్ల తదితరులు విశేష కృషి చేశారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సతీష్‌ వేమూరి వర్గానికి మాజీ అధ్యక్షులు జయ్‌ తాళ్ళూరి, ప్రస్తుత అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు మద్దతును ప్రకటించారు. ఈ టీమ్‌ విజయం కోసం వారు చేసిన కృషి ఫలించలేదు. ఈ టీమ్‌లో కీలకంగా ఉన్న అశోక్‌ కొల్లా, సతీష్‌ వేమూరి చేసిన ప్రచార వ్యూహాలు కూడా విఫలమయ్యాయి.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌

నరేన్‌ కొడాలి        13,225 (విజేత)
సతీష్‌ వేమూరి     10,362

బోర్డ్‌ డైరెక్టర్లు

లావు శ్రీనివాస్‌                       12,695 (విజేత)
రవి పొట్లూరి                          13,044 (విజేత)
శిరీష తూనుగుంట్ల                11,237
మల్లి వేమన                          11,774 (విజేత)
శ్రీనివాస్‌ ఉయ్యూరు              10,520
వెంకట రమణ యార్లగడ్డ       10,131

కార్యదర్శి

రాజా కసుకురి       12,456(విజేత)
అశోక్‌ కొల్లా            11,083

కోశాధికారి

భరత్‌ మద్దినేని      12,827 (విజేత)
మురళి తాళ్లూరి     10,617

జాయింట్‌ సెక్రటరీ

వెంకట్‌ కోగంటి       13,015 (విజేత)
వంశీ వాసిరెడ్డి         10,501

జాయింట్‌ ట్రెజరర్‌

సునీల్‌ పంత్రా        13,013 (విజేత)
శశాంక్‌ యార్లగడ్డ     10,463

కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌

రజినీ ఆకురాతి     10,177
లోకేష్‌ కొణిదల      13,362 (విజేత)

సాంస్కృతిక సేవా సమన్వయకర్త

రజనీకాంత్‌ కాకర్ల    10,854
ఉమా ఆర్‌ కటికి      12,638 (విజేత)

మహిళా సేవల సమన్వయకర్త

సోహిని అయినాల   12,009 (విజేత)
మాధురి యేలూరి    11,436

కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌

ప్రదీప్‌ గడ్డం          10,590
సతీష్‌ కొమ్మన       12,827 (విజేత)

అంతర్జాతీయ కో ఆర్డినేటర్‌

శ్రీధర్‌ కొమ్మాలపాటి   10,168
ఠాగూర్‌ మల్లినేని        13,300 (విజేత)

స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌

శ్రీరామ్‌ ఆలోకం      10,213
నాగ పంచుమూర్తి   13,261 (విజేత)

ఫౌండేషన్‌ ట్రస్టీ

రామకృష్ణ అల్లు                   12,515(విజేత)
భక్త బల్లా                              13,552 (విజేత)
శ్రీనివాస్‌ కూకట్ల                   12,286 (విజేత)
సత్యనారాయణ మన్నె        11,196
రవికిరణ్‌ మువ్వ                  10,490
నాగరాజు నలజుల                 9,883
సుమంత్‌ రామ్‌                      9,643
రవి సామినేని                      10,148
రాజా సూరపనేని                 13,170 (విజేత)
ఎండూరి శ్రీనివాస్‌               12,261 (విజేత)

 

కొత్త టీమ్‌కు వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు

తానా  నూతన కార్యవర్గానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన తానా ఎన్నికల్లో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా విజయం సాధించిన నరేన్‌ కొడాలికి, బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ రవి పొట్లూరి లకు మాజీ ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అభిప్రాయభేదాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని తెలుగుభాష, సంస్కృతి కోసం తానా చేస్తున్న సేవలు మరింత విస్తృతం చేయాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తానా అందిస్తున్న సేవలు అభినందనీయమని, అందరు కలిసిమెలిసి ఐకమత్యంతో మెలిగి తెలుగు ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని తెలిపారు.

లోకేష్‌ అభినందనలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నాయుడు కూడా తానా ఎన్నికల్లో గెలిచిన నరేన్‌ కొడాలికి, ఆయన టీమ్‌కు అభినందలు తెలియజేశారు.

అంజయ్య చౌదరి లావు అభినందనలు

తానా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ‘‘సరేన్‌ కొడాలి’’ టీంకు తానా తాజా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు శుభాకాంక్షలు తెలిపారు. నన్‌ కొడాలి టీంకు మద్దతు తెలుపవలసినదిగా చేసిన అభ్యర్ధనను మన్నించిన అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. సహృద్భావ వాతావరణంలో సా మరస్యపూర్వకంగా జరిగిన ఈ ఎన్నికల్లోగెలిచిన వారు, పోటీ చేసిన వారు అందరం ఇక ముందు కూడా ఎప్పటి లాగే కలిసి మెలసి తానాని అత్యున్నత శిరాన నిల్చుకునే విధంగా వ్యవహరిస్తూ ‘‘మన కోసం తానా.. తానా కోసం వనం’’ అని నినదిస్తూ విశ్వంలోని తెలుగు వారందరికీ సహాయపడే విధంగా మందుకు సాగుదాం అని పిలుపునిచ్చారు.

విధేయతే గెలిపించింది: నరేన్‌ కొడాలి

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా)లో దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఉన్న అనుభవం, వివిధ పదవులను నిర్వ హించి తానాలో అందరికీ పరిచయం ఉన్న నరేన్‌ కొడాలి ప్రస్తుతం జరిగిన తానా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా గెలిచారు. తానాతో ఆయనకు 2 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. 2005 నుంచి తానాలో వివిధ పదవులను నిర్వహించారు. 2005లో తానా ఐటీ కమిటీ కో చైర్‌గా పని చేసిన తరువాత కాన్ఫరెన్స్‌ చైర్మన్‌గా, బోర్డ్‌ డైరెక్టర్‌గా, చైర్మన్‌గా కూడా ఆయన పదవులను నిర్వహించారు. తానా బైలాస్‌ కమిటీ మెంబర్‌గా, లీగల్‌, ఇతర వ్యవహారాల కమిటీల్లో కూడా పనిచేసిన అనుభవం ఈ ఎన్నికల్లో ఆయనను తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా గెలిపించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ప్రజా విజయమన్నారు. ఈ గెలుపునకు సహకరించిన తానా సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తన దృష్టి అంతా తానాని కమ్యూనిటీకి మరింత దగ్గర ఎలా చేయాలన్నదే అని అంటూ, తానాకు అమెరికాలో శాశ్వత భవనం నిర్మించడం. ఇందుకోసం విరాళాలను సేకరించడంతోపాటు నా సొంత నిధులకింద 100కె డాలర్లు ఇవ్వడంతోపాటు, 250 కె డాలర్లను విరాళంగా సేకరిస్తాను. తానాలో అత్యధిక మంది సభ్యులు ఎఫ్‌ 1, హెచ్‌ 1 బి వీసాలపై అమెరికాకు వలస వచ్చినవారు. వీరికోసం ప్రత్యేకంగా లాయర్లతో శాశ్వత ప్రత్యేక న్యాయసేవల విభాగాన్ని ప్రారంభించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇందుకోసం తన సొంత నిధులు 50కె డాలర్లు విరాళంగా అందించనున్నాను. అమెరికాలోనే పుట్టి పెరిగిన యువతీయువకులను కూడా తానాకు చేరువ చేసే ప్రణాళికలో భాగంగా పోటీ పరీక్షలకు మార్గనిర్దేశకత్వం, శిక్షణ, సన్నద్ధత వంటి కార్యక్రమాలకు కూడా తన సొంత నిధులు 50కె డాలర్లను మూలధనంగా సమకూర్చి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఎన్నికలు ముగిశాయి కనుక అందరం కలిసి తానా ద్వారా కమ్యూనిటీకి సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

నా సేవలే నన్ను గెలిపించాయి: రాజా కసుకుర్తి

తానాకు నేను చేస్తున్న నిస్వార్థ సేవలే నన్ను గెలిపించాయని రాజా కసుకుర్తి తెలిపారు. అనతికాలంలోనే అతి ముఖ్యమైన పదవిని తనను ఎన్నుకున్న తానా సభ్యులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. తానా కార్యదర్శిగా పలు కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూడటంతోపాటు అటు బోర్డుతో కలిసి తానా పటిష్టతకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిపించిన తానా సభ్యులకు, నరేన్‌ కొడాలి టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

ఫైనాన్షియల్‌గా పటిష్టపరుస్తా: భరత్‌ మద్దినేని

తానా ట్రెజరర్‌గా ఎన్నికైన భరత్‌ మద్దినేని మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన తానా కాన్ఫరెన్స్‌కు ట్రజరర్‌గా వ్యవహరించిన అనుభవంతోపాటు తానాతో ఉన్న అనుబంధం కారణంగా తానాను ఆర్థికంగా బలపరచడంతోపాటు, పారదర్శకంగా నిధుల సేకరణ, వ్యయాలు ఉండేలా చూస్తానని, ఆ దిశగా కార్యాచరణను అమలు చేయనున్నట్లు చెప్పారు. తనను ఈ ఎన్నికల్లో గెలిపించిన తానా సభ్యులకు, నరేన్‌ కొడాలి టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

మెంబర్‌షిప్‌లను పెంచడంపై దృష్టి: వెంకట్‌ కోగంటి

తానా జాయింట్‌ సెక్రటరీగా ఎన్నికైన వెంకట్‌ కోగంటి మాట్లాడుతూ, తానా సభ్యుల డాటాను సక్రమంగా తీర్చిదిద్దటంతోపాటు కొత్త సభ్యులను చేర్పించేందుకు తనవంతుగా కృషి చేస్తానని వెంకట్‌ కోగంటి తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిపించిన తానా సభ్యులకు, నరేన్‌ కొడాలి టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

తానా టీమ్‌స్క్వేర్‌కు నిధులు సేకరిస్తా: సునీల్‌ పంట్ర

తానా జాయింట్‌ ట్రెజరర్‌గా ఎన్నికైన సునీల్‌ పంట్ర మాట్లాడుతూ, టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకుని తానా నిధుల వ్యవహారంలో పారదర్శకతకు పెద్ద పీట వేసేందుకు కృషి చేయడంతోపాటు, టీమ్‌ స్క్వేర్‌కు లక్ష డాలర్ల నిధులను సేకరించి దాని ద్వారా మరింతమందికి సేవలందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిపించిన తానా సభ్యులకు, నరేన్‌ కొడాలి టీమ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

 

 

Tags :