ASBL Koncept Ambience

నరేన్ టీంకు బే ఏరియా వాసుల మద్దతు...విజయవంతంగా ప్రచారం

నరేన్ టీంకు బే ఏరియా వాసుల మద్దతు...విజయవంతంగా ప్రచారం

‘తానా’ ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ కొడాలి నరేన్ టీం శనివారం నాడు బే ఏరియాలో పర్యటించింది. బే ఏరియాలో ఉన్న తెలుగు వారందరితో మమేకమయ్యేందుకు”మీట్ అండ్ గ్రీట్ డాక్టర్ నరేన్ కొడాలి టీం”పేరుతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది.  ‘తానా’ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ కాకర్ల సుబ్బారావుగారికి ఘన నివాళులు అర్పించి ఈ ఆత్మీయ సమ్మేళాన్ని ప్రారంభించారు. ‘తానా’కు కాకర్ల సుబ్బారావు చేసిన అనిర్వచనీయమైన సేవలను సమ్మేళనానికి విచ్చేసిన వారంతా గుర్తు చేసుకున్నారు. కాకర్ల సుబ్బారావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు సంతాపం ప్రకటించారు. కాకర్ల సుబ్బారావు అడుగుజాడల్లో నడిచి ‘తానా’ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు అందరూ కృషి చేస్తామని సంకల్పించారు.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సాఫ్ట్వేరు కంపెనీలకు నిలయమైన సిలికాన్ వ్యాలీ లో కంప్యూటర్ సైన్స్ లో ఆచార్యుడైన డాక్టర్ నరేన్ కొడాలి చేసిన ప్రసంగం మరియి తమ ప్యానెల్ నే ఎందుకు గెలిపించాలో అని వివరించిన విధానం అందరిని ఆలోచింప చేసింది.  జగదీష్ ప్రభల(కోశాధికారి అభ్యర్థి), సునీల్ పాంత్రా (ఉమ్మడి కోశాధికారి అభ్యర్థి), రాజా సూరపనేని( ఫౌండేషన్ ట్రస్టీ  అభ్యర్థి), స్థానిక అభ్యర్థులు వెంకట్ కోగంటి (ఉమ్మడి కార్యదర్శి) ,రజనీకాంత్ కాకర్ల (కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్) ప్రసంగిస్తూ తాము గతం లో ‘తానా’ లో వివిధ హోదాలలో చేసిన పనులను గుర్తుచేస్తూ, తాము చేయబోయే ప్రణాళికను వివరించి తమను గెలిపించమని అభ్యర్ధించారు.

‘తానా’ మాజీ అధ్యక్షులు జయరాం కోమటి తను ఎందుకు ఈ ప్యానెల్ ని సమర్దిస్తున్నానో వివరించారు. రాజకీయ కారణాలతో కార్యదర్శి అభ్యర్దిగా పోటీ చేసే అవకాశాన్ని తృటిలో పోగొట్టుకొన్న భక్త బల్ల ఈ ప్యానెల్ నే గెలిపించమని అభ్యర్ధించారు.  44 ఏళ్ల ‘తానా’ చరిత్రలో ‘తానా’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉగాది పచ్చడితో పాటు నోరూరే 28 రకాల వంటకాల మెనూ తో ఏర్పాటు చేసిన ‘బాహుబలి/’అఖండ‘ విందు అందరిని ఆకొట్టుకొంది.

కరోనా విపత్తు తర్వాత భారీ సంఖ్యలో తెలుగు వారంతా హాజరైన తొలి సభ ఇదే. ఈ కార్యక్రమంలో ‘అఖండ’ గా రాబోతోన్న నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై సందడి చేశారు.  ఈ నెవర్ బిఫోర్…ఎవర్ ఆఫ్టర్ విందును ఆహూతులంతా ఆస్వాదించారు. చాలాకాలం తర్వాత ఎన్నో రకాల తెలుగు వంటకాలతో అచ్చ తెలుగు భోజనం ఆరగించామని ప్రశంసించారు. ‘బాటా’ సలహాదారు ‘శ్రీమతి విజయ ఆసూరి’ ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు.  ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన కృష్ణ గొంప,లియోన్ బోయపాటి,గోకుల్ రాచిరాజు,భారత్ ముప్పిరాల, శ్రీకర్ రెడ్డి,చంద్ర గుంటుపల్లి,వీరబాబు పత్తిపాటి,విజయ్ గుమ్మడి,లక్ష్మణ్ పరుచూరి,సతీష్ బోళ్ల,సత్య తిపిర్నేని,ప్రకాష్ మద్దిపాటి,సందీప్ ఇంటూరి(స్వాగత్),మురళి గొడవర్తి,హర్ష యడ్లపాటి తదితరులకు మరియు తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన తెలుగువారందరికీ డాక్టర్ నరేన్ కొడాలి టీం, వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్ల, రామ్ తోట ధన్యవాదాలు తెలిపారు.

 

Tags :