నాటా అట్లాంటా డే విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) అట్లాంటా బృందంవారు నార్‌క్రాస్‌లోని ఏసియానా బాంక్వెట్ హాల్‌లో నిర్వహించిన నాటా అట్లాంటా డే వేడుకలు వైభవంగా జరిగాయి. జూన్ 30, జూలై 1, జూలై 2 తేదీల్లో డల్లాస్‌లో జరగనున్న నాటా మహాసభల ప్రచార కార్యక్రమంతోపాటు నిధుల సేకరణ కోసం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ టాలెంట్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గణేశ ప్రార్థనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేమ్స్ చేసిన స్పూర్తిదాయకమైన ప్రసంగం హైస్కూల్ విద్యార్థులకు, యువతకు ప్రేరణగా నిలిచింది. యూత్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు గురు పరదారామి, దీప్తి దొడ్ల ఆధ్వర్యంలో టాలెంట్ పోటీలు నిర్వహించారు. 15 మంది పిల్లలు పాల్గొని, ప్రతి పార్టిసిపెంట్‌కు రెండు నిమిషాల సమయ పరిమితితో గానం, నృత్యం మరియు వాయిద్యం వాయించడంలో తమ ప్రతిభను ప్రదర్శించారు. న్యాయనిర్ణేతలు (వాహిని రాగాల, సుబ్బారావు మద్దాలి) విజేతలను ఎంపిక చేశారు. వారికి నగదు బహుమతులు అందించారు. పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు బహుకరించారు. శ్రీవల్లి బూదరాజు, శ్రీలక్ష్మీ దోసపాటి టీమ్‌లకు చెందిన చిన్నారులు చేసిన అద్భుతమైన గ్రూప్ డ్యాన్స్ ప్రదర్శనలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
ప్రధాన కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది. నీలిమ గడ్డమనుగు బృందం వినాయకుడిని స్తుతిస్తూ స్వాగతగీతను పాడింది. ఆర్య డ్యాన్స్ అకాడెమీ వారి సంగీత మెడ్లీ, లేజీ డ్యాన్స్, టాలీవుడ్ మెడ్లీ. పుష్యమి గొట్టిపాటి టీమ్‌లచే కూచిపూడి డ్యాన్స్ మరియు టాలీవుడ్ మెడ్లీ వంటి కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో పలువురు నాటా నాయకులు పాల్గొన్నారు. గురుపరదారిమి స్వాగత ఉపన్యాసం చేశారు. అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి నాటా లక్ష్యాలను, సేవా కార్యక్రమాలను, డల్లాస్ కన్వెన్షన్ గురించి వివరించారు. నాటా డే కో ఆర్డినేటర్ రవి కందిమళ్ళ, అట్లాంటాకు చెందిన దీప్తి దొడ్ల, మాధవి ఇందుర్తి తదితరులు రాబోయే కార్యక్రమాలను తెలియజేశారు. శంకరరత్న అవార్డు గ్రహీత బాలా ఇందుర్తితోపాటు గౌతమ్ గోలి, తంగిరాల సత్యనారాయణ రెడ్డి, కిరణ్ పాశం, శ్రీని వంగిమల్ల, కరుణ్ ఆసిరెడ్డి మరియు ఇతరులను వేదికపైకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లను రవి కందిమళ్ల ప్రశంసించారు. నాటా అట్లాంటా టీమ్ సభ్యులు పుష్యమి గొట్టిపాటి, కల్చరల్ కోఆర్డినేటర్, గురు పరదారామి, యూత్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, దీప్తి రెడ్డి, యూత్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, రఘు సగిలి మరియు శ్రీధర్ సిర్గిరి, వేదిక కోఆర్డినేటర్లు, రవి బోరెడ్డి, ఈవెంట్ రిజిస్ట్రేషన్ లాజిస్టిక్స్ కోఆర్డినేటర్, ముత్యం రెడ్డి, రaాన్సీ, ముత్యం రెడ్డి హేమా శిల్ప ఉప్పల కల్చరల్ టీమ్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.