ASBL Koncept Ambience

ఎపికి ప్రత్యేక హోదాపై నాటా మహాసభల్లో చర్చలు

ఎపికి ప్రత్యేక హోదాపై నాటా మహాసభల్లో చర్చలు

ఉత్తర అమెరికా తెలుగ సమితి (నాటా) ఫిలడెల్పియాలో జూలై 6 నుంచి 8వ తేదీవరకు నిర్వహించే మహా సభల్లో ఏపీకి ప్రత్యేక హోదా అవశ్యకతను చాటి చెపుతామని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఇటీవల లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో పాటు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్‌రెడ్డి, నందమూరి లక్ష్మిపార్వతి నాటా సభల్లో పాల్గొనబోతున్నారు. నాటా సభలు జరగనున్న ఫిలడెలీయాేకు జులై 5 కల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బందం రానుందని పార్టీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ రమేష్‌ రెడ్డి వల్లూరు, పార్టీ యూఎస్‌ కన్వీనర్‌ రత్నాకర్‌ పండుగాయల తెలిపారు.

వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను నాటా వేదికగా వేలాది మంది ఎన్నారైలకు చాటి చెపుతామన్నారు. జులై 8, 2018 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్‌ జయంతిని నాటా మహాసభల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్‌ సిపి యూఎస్‌ఏ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తుందని తెలిపారు.

పార్టీ నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక ష?రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితలు నాటా పొలిటికల్‌ ఫోరం సభల్లో పాల్గొంటారని తెలిపారు.

 

Tags :