ASBL Koncept Ambience

సాధన సంస్థకు 2 లక్షలు విరాళమిచ్చిన నాటా

సాధన సంస్థకు 2 లక్షలు విరాళమిచ్చిన నాటా

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మాతృరాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సేవా డేస్‌ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న మానసిక వికలాంగుల సంస్థ సాధన ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించింది. నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి, కార్యదర్శి ఆళ్ళ రామిరెడ్డి, ట్రెజరర్‌ గండ్ర నారాయణ రెడ్డి, బోర్డ్‌ డైరెక్టర్‌ సుధారాణి కొండపు, శ్రీనివాస్‌ అమర్‌ తదితరులు పాల్గొన్నారు. సాధన ఇన్‌స్టిట్యూట్‌ ఫౌండర్‌, చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి, వారి సతీమణి శ్రీమతి సురేఖ, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌ రాఘవరెడ్డి గోసల మాట్లాడుతూ, నాటా సేవాడేస్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌, అనాథ శరణాలయాలు, మానసిక వికలాంగుల వసతి గృహాలను సందర్శించి సహాయం చేయనున్నట్లు చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలు డిసెంబర్‌ 24వరకు జరుగుతాయని చెప్పారు ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని అంటూ ఇలాంటి సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్న మధుసూధర్‌ రెడ్డిని అభినందిస్తున్నట్లు నాటా నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాటా నాయకులు సంస్థకు 2 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించి అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Click here for Event Gallery

 

Tags :