తెలుగు రాష్ట్రాల్లో నాటా సేవలు
అమెరికాలోని తెలుగువారి సంక్షేమానికి కృషి చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా), ఏపీ తెలంగాణలో కూడా నాటా సేవా డేస్ పేరుతో వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని నాటా అధ్యక్షుడు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన నాటా సభ్యులతో కలిసి ఆయన మీడియాతో 2011లో అమెరికాలో డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి అడ్వైజర్ కౌన్సిల్ చైర్మన్‌గా నాటా ఆవిర్భవించిందని తెలిపారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మహాసభలు నిర్వహిస్తుంటామని తెలిపారు. ఈ క్రమంలోనే 2023 జూన్ 30 నుంచి జూలై 30 నుంచి జూలై 2 వరకు అమెరికా డల్లాస్‌లో నాటా తెలుగు మహాసభలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ను ఆహ్వానించామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. నాటా సేవా డేస్‌లో భాగంగా బస్సు యాత్ర చేపట్టామని ఈ నెల 9 నుంచి 27 వరకు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్‌లో సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26న నాటా అడ్వైజర్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డికి నెల్లూరులో పౌరసన్మానం, 27న బిట్రగుంటలో స్కూల్ భవనానికి, మధ్యాహ్న భోజన గదికి సహాయం చేయటం, శ్రీసిటీ సందర్శనతో తమ బస్సు యాత్ర ముగుస్తుందని తెలిపారు.