ASBL Koncept Ambience

పశ్చిమ గోదావరి జిల్లాలో నాటా నాయకుల పర్యటన

పశ్చిమ గోదావరి జిల్లాలో నాటా నాయకుల పర్యటన

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) నాయకులు సేవాడేస్‌ కార్యక్రమాల్లో భాగంగా మాతృరాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తమ పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని హనుమాన్‌ జంక్షన్‌లో ఉన్న ఆశాజ్యోతి వికలాంగుల శరణాలయాన్ని నాటా నాయకులు సందర్శించారు. పిల్లల సంక్షేమానికి, ఆశ్రమ నిర్వాహణకు తమవంతుగా ఆర్థిక సాయంను అందజేశారు. కార్యక్రమంలో నాటా అధ్యక్షులు రాఘవరెడ్డితోపాటు, శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ రామిరెడ్డి, గండ్ర నారాయణరెడ్డి, సుధ కొండపు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :