ASBL Koncept Ambience

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన నాటా ‘సేవ’ కార్యక్రమాలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన నాటా ‘సేవ’ కార్యక్రమాలు

అమెరికా, కెనడా దేశాల్లో ఉంటున్న తెలుగువారి అభ్యున్నతికి కృషి చేస్తూ, వారి సంక్షేమానికి పాటుపడుతూనే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) మాతృరాష్ట్రాలలో కూడా నాటా సేవా డేస్‌ పేరుతో వివిధ  సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  డిసెంబర్‌ 9 నుంచి 27వరకు నాటా సేవా డేస్‌ లో భాగంగా తెలుగు ప్రజలకు సేవలందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నాటా అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి తెలిపారు. నాటా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆళ్ళ రామిరెడ్డి ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా అనాధ శరణాలయాలకు, ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. గ్రామాల్లో రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. కంటి చికిత్స శిబిరాలు, సోలార్‌ వీధి లైట్ల ఏర్పాటు, బస్‌ షెల్టర్‌ సౌకర్యాల కల్పన, స్కూల్‌ భవనాల మరమ్మతులు, కంప్యూటర్‌ ల్యాబ్‌, క్లాస్‌ రూమ్‌ల ఏర్పాటు, ప్లే గ్రౌండ్‌, కాంపౌండ్‌వాల్‌ ఏర్పాటు వంటి సహాయాన్ని ఈ నాటా సేవా డేస్‌లో భాగంగా దాతల సహాయంతో చేస్తున్నారు. 

డిసెంబరు 9న మలక్‌పేట, నల్గొండ
డిసెంబర్‌ 10న సిద్దాపూర్‌ (జరసంగం)
డిసెంబర్‌ 11న యాపదిన్నె (ఐజా-గద్వాల్‌)
డిసెంబర్‌ 12న ఖమ్మం, వైజాగ్‌
డిసెంబర్‌ 13, 14న వైజాగ్‌లోని అరకు లోయ
డిసెంబర్‌ 15న వైజాగ్‌లో సాంస్కృతిక జానపద కళాశోభ
డిసెంబర్‌ 16న విజయవాడలోని హనుమాన్‌ జంక్షన్‌
డిసెంబర్‌ 17న విజయవాడ  పాకాల, బి.నిడమనూర్‌, శంతనూతలపాడు
డిసెంబర్‌ 18న విజయవాడలోని  వల్లభాపురం, కొల్లిపార, నరసరావుపేట
డిసెంబర్‌ 19న తాడేపల్లి, గుంటూరు
డిసెంబర్‌ 20న ప్రకాశం జిల్లా
డిసెంబర్‌ 21న చిన్నకంబలూరు, ప్రొద్దుటూరు, నర్సాపురం
డిసెంబర్‌ 22న సింగనమల, కొరివిపల్లి, పోతురాజుకాల్వ, మద్దలపల్లి, బొమ్మకుంటపల్లి, మేడికుర్తి, దుగ్గుపల్లి,
డిసెంబర్‌ 23న కడప
డిసెంబర్‌ 24న తిరుపతిలోని మిట్టకంద్రిక, చంద్రగిరి
డిసెంబర్‌ 25న తిరుమల, ఆత్మకూర్‌, వాత్సల్య
డిసెంబర్‌ 26న నెల్లూరులోని బిట్రగుంట, వీపీఆర్‌ కన్వెన్షన్‌
డిసెంబర్‌ 27న నిడుగుంట పాలెం, శ్రీసిటీ
ప్రాంతాల్లో నాటా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 

 

Tags :