'నాటా' ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ పోటీలు
ప్రతిభ కలిగిన లఘు చిత్ర దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించబోతోంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జూలై 6 నుంచి 8 వరకు రెండు రోజుల పాటు జరిగే నాటా ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు శివ మేక, మహేందర్, ఉదయ్ తెలిపారు.
ప్రముఖ దర్శకులు వంశీ, హరీశ్ శంకర్, మధుర శ్రీధర్, మహి వి రాఘవ్, డాక్టర్ ఆనంద్ ఈ పోటీలకు న్యాయ నిర్నేతలుగా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ వేదికపై, అతిరథమహారథుల సమక్షంలో జరగబోయే ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు. యువ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ కాంటెస్ట్‌లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని ఆనంద్ కోరారు. విజేతలకు లక్ష రూపాయల వరకు బహుమతులు ఉంటాయని, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డ్‌లు, ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు.
షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ తమ చిత్రలను నాటా వారి వెబ్‌సైట్‌లో కానీ, www.nata2018.org/event/event_view/2 లింక్ ద్వారా గానీ రిజిస్టర్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.