ASBL Koncept Ambience

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన నాటా బృందం

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన నాటా బృందం

ఆంధ్రప్రదేశ్‌లో నాటా సేవాడేస్‌ కార్యక్రమాల్లో భాగంగా పర్యటిస్తున్న నాటా నాయకులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డిని గురువారంనాడు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వచ్చే సంవత్సరం న్యూజెర్సిలోని అట్లాంటిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జూన్‌ 26 నుంచి 28 వరకు జరగనున్న నాటా కన్వెన్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన నాడు-నేడు స్కూల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమానికి కూడా నాటా సహాయాన్ని అందిస్తుందని కూడా వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నాటా నాయకులు రాష్ట్రానికి చేస్తున్న సేవలను ఈ సందర్భంగా వైఎస్‌జగన్‌ తెలుసుకుని అభినందించారు. నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల, కార్యదర్శి ఆళ్ళ రామిరెడ్డి, కోశాధికారి నారాయణరెడ్డి, సుధా కొండపు, పీఆర్‌ఓ డివి కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :