ASBL Koncept Ambience

నల్లగొండ జిల్లాలో నాటా నాయకుల పర్యటన

నల్లగొండ జిల్లాలో నాటా నాయకుల పర్యటన

నాటా సేవాడేస్‌లో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) నాయకులు నల్లగొండ జిల్లాలో పర్యటించారు. నల్లగొండలో ఉన్న ఛారుమతి చైల్డ్‌ కేర్‌ సెంటర్‌ను వారు సందర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా నాటా నాయకులు మాట్లాడుతూ, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవ ప్రశంసనీయమని అంటూ, నాటా కూడా తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నాటా సేవాడేస్‌పేరుతో ఈసారి వివిధ స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన చేయూతను, ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని చెప్పారు. చర్లపల్లిలో ఉన్న స్నేహ అనాథాశ్రమాన్ని కూడా నాటా నాయకులు సందర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. నాటా డైరెక్టర్‌ రవి కందిమళ్ళ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేశారు. నాటా అధ్యక్షుడు రాఘవ రెడ్డి గోసల, ఆళ్ళ రామిరెడ్డి, నారాయణరెడ్డి గండ్ర, సుధ కొండపు తదితరులు ఈ కేంద్రాలను సందర్శించినవారిలో ఉన్నారు.

Tags :