ASBL Koncept Ambience

అంగరంగ వైభవంగా ప్రారంభమైన నాట్స్ తెలుగు సంబరాలు

అంగరంగ వైభవంగా ప్రారంభమైన నాట్స్ తెలుగు సంబరాలు

8 వేల మందికి పైగా హాజరు
తరలివచ్చిన తెలుగు సినీతారలు.. డ్యాన్స్ హంగామాలతో సందడి

ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నాట్స్ జరిపే అమెరికా తెలుగు సంబరాలు ఇర్వింగ్ లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగుదనం ఉట్టి పడేలా అలంకరించిన వేదికలో పూర్ణ కుంభ పూజతో సంబరాలను ప్రారంభించారు. మనమంతా తెలుగు మనసంతా వెలుగు అనే భావనను ప్రతిబింబిస్తూ చేపట్టిన తొలి కార్యక్రమం తెలుగు జాతి ప్రత్యేకతను చాటింది.

ఆతర్వాత 800 మంది వీఈసీ కాలేజ్ అలూమ్నై కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. గందరగోళం అంటూ మనబడి విద్యార్ధులు చేసిన ప్రదర్శన అందరిని అలరించింది. జూనియర్ ఎన్టీఆర్ మేడ్లీ చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్  అందరిచేత స్టెప్పులు వేయించింది. చిన్నారుల చేత కూడా మెడ్లీ డ్యాన్సులు వేయించి సంబరాల సంతోషాన్ని పంచారు. ఆ తర్వాత త్రీడీ డ్యాన్స్ డ్రామా, గిరిజన నృత్యం ధింసా కూడా సంబరాలకు మంచి ఊపునిచ్చింది. 

డ్యాన్సింగ్ బన్నీస్ అంటూ డ్యాన్స్ మెడ్లీ మరోసారి స్టేజ్ పై చేసిన డ్యాన్స్ కూడా విశేషంగా అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత చిచ్చర పిడుగులు, కలర్స్ ఆఫ్ డ్యాన్స్, తూర్పు కొండలు పేరుతో జానపద నృత్యం, రిథమ్స్ ఇన్  కూచిపూడి జీవితంలోని అన్ని కోణాలను స్పృజిస్తూ చేసిన నృత్యానికి మంచి స్పందన లభించింది. సంగీత పరికరాలతో నాదామృతవర్షణి కార్యక్రమం సంగీత ప్రియుల మనస్సును పరవశింపచేసింది. ఆ తర్వాత క్రీడా, మహిళ విభాగాల్లో పెట్టిన పోటీల్లో విజేతలైన వారికి ప్రత్యేక అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. అనంతరం మహానటి సావిత్రిని గుర్తు చేస్తూ ప్రత్యేకంగా చేసిన డ్యాన్స్ డ్రామా విశేషంగా ఆకట్టుకుంది.

శ్రీ కృష్ణామృతం పేరుతో కృష్ణుడి జీవితాన్నివివరిస్తూ  చేసిన ఫ్యూజన్ డ్యాన్స్ డ్రామా కూడా మంచి స్పందన లభించింది. సాయంత్రం గాలిక గణేష్ పేరుతో జానపద నృత్యం, ఉట్టిమీద కూడు అంటూ బావ మరదల మధ్య సాగే జానపద నృత్యం కూడా ప్రేక్షకులతో చిందులు వేయించింది. యూత్ కమిటీ రూపొందించిన నవతరం కార్యక్రమానికి కూడా మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ జ్ఞాపకాలు పేరుతో వైవిఎస్ చౌదరి చేసిన ప్రసంగం ఎన్టీఆర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు సినీ తార చేసిన డ్యాన్స్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. మిమిక్రి శివారెడ్డి చేసిన మిమిక్రి నవ్వులు పువ్వులు పూయించింది. సంబరాల స్వాగత గేయ రచయిత సిరాశ్రీ, భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, మిమిక్రి శివారెడ్డి, జితేంద్ర, డాన్స్ మాస్టర్ సత్య తదితరులు కూడా ఈ సంబరాలలో పాలుపంచుకున్నారు.

డాక్టర్ సాయికుమార్ దానవీర శూర కర్ణ కాన్సెప్ట్ తో చేసిన పౌరాణిక ఏకపాత్రాభినయానికి ప్రేక్షకులు తమ కరతాళ ధ్వనులతో హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమా స్టార్ హీరోయిన్ భాను శ్రీ చేసిన డ్యాన్స్ అలరించింది. నాట్స్ ఎలాంటి ఉన్నతమైన కార్యక్రమాలుచేస్తుంది...తెలుగుజాతికి ఎలా అండగా నిలబడుతుందనేది నాట్స్  ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి వివరించారు.

ఆ తర్వాత సంబరాల చీఫ్ గెస్ట్ సినీ నటి తమన్నా స్టేజ్ మీదకు రావడంతో అందరూ ఒక్కసారిగా హర్షధ్వనాలతో స్వాగతం పలికారు. తమన్నా నాట్స్ గురించి.. అమెరికాలోతెలుగువారు చేపట్టే కార్యక్రమాల గురించి చాలా చక్కగా మాట్లాడారు.  ఆ తర్వాత జరిగిన మనో అండ్ గ్రూప్ మ్యూజిక్ కార్యక్రమం హుషారైన పాటలతో హోరెత్తించింది. ప్రేక్షకులు మనో పాటలకు ఆనందంతో చిందులేశారు. సంబరాల సంతోషాన్ని ఆస్వాదించారు.

నాట్స్ సంబరాలకుదాతలుగా వ్యవహరించిన పలువురు దాతలకు, బోర్డ్, ఈసీ సభ్యులను సంబరాల కమిటీ నిర్వాహకులు ప్రశంసా షీల్డ్ లతో సన్మానించారు. డాక్టర్  దేవయ్య, డాక్టర్ రాజు, బాపయ్య చౌదరి నూతి, ప్రణతి పిల్లుట్ల, ఐఫర్ ఫార్మర్స్ వ్యవస్థాపకులు సురేష్, రవి ఖంఠంశెట్టి, శ్రీకాంత్ & లక్ష్మి బొజ్జ, శ్రీకాంత్ తనికొండ, వెంకన్న చౌదరి యార్లగడ్డ, సురేష్ కంకణాల, వెంకట చింతలపాటి, డా. పెద్దిరెడ్డి శ్రీధర్ ఒమేగా హాస్పిటల్ హైదరాబాద్, శేఖర్ అన్నే, న్యూజెర్సీ సాయిదత్త పీఠం వ్యవస్థాపకులు రఘుశర్మ శంకరమంచి లకు సేవా పురస్కారాలు అందించారు. బావర్చి వారు ప్రత్యేక శాఖాహార, మాంసాహార వంటలతో అతిధులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి డా. మధు కొర్రపాటి ప్రత్యేక సమావేశ మందిరంలో ఆహూతులకు వివరించారు. సాయంత్రం, 350 పేజీల సంబరాల ప్రత్యేక సంచిక తెలుగు దీపిక ను విడుదల చేశారు.

Click here for Event Gallery

 

Tags :