ASBL Koncept Ambience

నాట్స్ సంబరాలకు సిద్ధమవుతున్న ఇర్వింగ్

నాట్స్ సంబరాలకు సిద్ధమవుతున్న ఇర్వింగ్

ప్రతి రెండేళ్ళకోమారు నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు  సంబరాలకు ఇర్వింగ్‌ సిద్ధమవుతోంది. ఇర్వింగ్‌లోని ఇర్వింగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మే 24,25,26 తేదీల్లో జరిగే ఈ సంబరాలకు ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారని కన్వెన్షన్‌కు చైర్మన్‌గా, కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న కిషోర్‌ కంచర్ల తెలిపారు. అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి నాట్స్‌ ఎంతో సేవలందిస్తోందని, అన్నీ ప్రాంతాల్లో నాట్స్‌ చాప్టర్‌ ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పారు. సంబరాలకు తెలుగు అతిరథ మహారథులు, సంగీత దర్శకులు కీరవాణితోపాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వస్తున్నారని ఆయన వివరించారు. ఈ సంబరాలకోసం ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమాలను కూడా విజయవంతంగా చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాల్లో భాగంగా టెక్సాస్‌లో పార్క్‌ ప్లాజా టవర్స్‌లో నిర్వహించిన ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. దాదాపు 6 లక్షల డాలర్లను విరాళాలుగా ఇస్తామని ఈ కార్యక్రమానికి వచ్చినవారు ప్రకటించారని తెలిపారు.

కాన్ఫరెన్స్‌ కమిటీ

కాన్ఫరెన్స్‌ నిర్వహణ కమిటీ ఈ విధంగా ఉంది. కిషోర్‌ కంచర్ల (చైర్మన్‌), విజయ్‌ శేఖర్‌ అన్నె (కో చైర్మన్‌), అది గెల్లి (వైస్‌ చైర్మన్‌), ప్రేమ్‌ కలిదింది (వైస్‌ చైర్మన్‌), రాజేంద్ర మాదాల (సెక్రటరీ), బాపయ్య చౌదరి నూతి (ట్రెజరర్‌), మహేష్‌ ఆదిభట్ల (జాయింట్‌ సెక్రటరీ), విజయ్‌ వర్మ కొండ (మార్కెటింగ్‌ డైరెక్టర్‌), భానులంక (హాస్పిటాలిటీ డైరెక్టర్‌), కిషోర్‌ వీరగంధం (ఆపరేషన్స్‌ డైరెక్టర్‌), రామిరెడ్డి బండి (ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌), చినసత్యం వీర్నపు (టాంటెక్స్‌ ప్రెసిడెంట్‌)

Tags :