ASBL Koncept Ambience

నాట్స్‌ మేట్రిమోని

నాట్స్‌ మేట్రిమోని

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి.ఈ సంబరాల్లో భాగంగా నాట్స్‌ మేట్రిమోనియల్‌ ఏర్పాటు చేశారు. యువతీ యువకులు, వారి తల్లితండ్రులు ఒకరినొకరు కలుసుకుని ఒకరికి ఒకరు తెలుసుకుని తమ ఇష్టాలకు అనుగుణంగా ఉన్న వివాహ బంధాలను ఏర్పాటు చేసుకునేందుకు వేదికగా నాట్స్‌ సంబరాలు నిలవనున్నది. మే 27వ తేదీన పేరెంట్స్‌ మీట్‌, వధూవరుల వేదికను ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్నవారే దీనికి అర్హులని కమిటీ పేర్కొంది. 

 

Tags :