ASBL Koncept Ambience

అమెరికా తెలుగు (న్యూజెర్సీ) సంబరాలు

అమెరికా తెలుగు (న్యూజెర్సీ) సంబరాలు

అమెరికా తెలుగు సంబరాలు (7వ ద్వైవార్షిక జాతీయ సమావేశం) న్యూజెర్సీ ఎక్స్‌పో సెంటర్, 97 సన్‌ఫీల్డ్ అవెన్యూ, ఎడిసన్, లో మే 26 నుండి మే 28,2023 వరకు నిర్వహించబడుతోంది. ఈ మూడు రోజుల సంబరాలు సినీ దిగ్గజ నటీ నటులతో ఆత్మీయ సమావేశాలు, ప్రముఖ సంగీత దర్శకులచే తెలుగు సంగీత కార్యక్రమాలు, సాహిత్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వీటితో పాటు నాట్స్ సరికొత్తగా నిర్వహించబోతున్న అమ్మ,నాన్నలకు సత్కారం కార్యక్రమం, పూర్వ విద్యార్థుల సమావేశాలు, ఆరోగ్య సదస్సులు, మహిళా వేదికలు, న్యాయ అవగాహన వేదికలు, వ్యాపార సదస్సులు ఇలా అందరికి ఉపయుక్తమైన ఎన్నో సదస్సులు జరగనున్నాయి. ఇక యువతరాన్ని ఆకట్టుకునేలా.. వారికి ఉపయోగపడేలా కార్యక్రమాలు రూపొందించబడ్డాయి.. మరీ ఇంకెందుకు ఆలస్యం.. మన సంబరాల వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు కూడా సంబరాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు మీ పేర్లు నమోదు చేసుకోండి.

సంబరాల్లో  మీ పేర్లు నమోదు చేసుకోండి.

 

 

 

Tags :