ASBL Koncept Ambience

నాటి నటీనటులకు, కె. విశ్వనాధ్‌కు నాట్స్‌ నివాళులు... ప్రత్యేక కార్యక్రమాలు

నాటి నటీనటులకు, కె. విశ్వనాధ్‌కు నాట్స్‌ నివాళులు... ప్రత్యేక కార్యక్రమాలు

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సంబరాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు ప్రత్యేకతను సంతరించుకుని అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సంబరాల్లో ఇటీవల మరణించిన నటీనటులకు నివాళులర్పిస్తూ, వారు చేసిన సినిమాలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కృష్ణ, కృష్ణంరాజు, జమున, కైకాలకు ప్రత్యేకంగా నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా వారి సినిమాల్లో నుంచి కొన్ని ఆట పాటలను కార్యక్రమాల్లో ప్రదర్శించనున్నారు. నృత్య ప్రదర్శనలు, ప్రసంగాలు, దృశ్య శ్రవణ రూపకాలు, నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 

సృత్యంజలి పేరుతో కె. విశ్వనాధ్‌్‌కు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నివాళులు అర్పిస్తున్నారు. కళాతపస్వి సినిమాల్లోని తెలుగుదనానికి పెద్ద పీట వేసిన సినిమాలను గుర్తు చేసుకుంటూ కొన్ని కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. 

 

 

Tags :