ASBL Koncept Ambience

హారీస్‌ బర్గ్‌ నగరంలో ఎన్డీఎ కూటమి సంబరాలు

హారీస్‌ బర్గ్‌  నగరంలో ఎన్డీఎ కూటమి సంబరాలు

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న పెన్సిల్వేనియా రాష్ట్ర రాజధాని హారీస్‌ బర్గ్‌ నగరంలో నారా చంద్ర బాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎన్డీఎ కూటమి అఖండ విజయం మరియు 4వ సారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు దేశం, జనసేన, భారతీయ జనత పార్టి మద్దతుదారుల సంబరాలు అంబరాన్ని అంటాయి.

తొలుత అభినులు అంతా కార్లతో ర్యాలీగా వేడుకలు జరిగిన ప్రాంతానికి తరలివచ్చారు. కార్లైల్లోలోని విస్పరింగ్‌ పైన్స్‌ కన్వెన్షన్‌ హాల్‌ లో సుమారు 1000 మంది కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులు, సానుభూతిపరులు మరియు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కాంక్షితులు హాజరై తమ సంతోషాన్ని పంచుకున్నారు. సమీప పెద్ద నగరాలైన పిట్స్‌ బర్గ్‌, ఫిలడెల్ఫియా నుండి అభిమానులు తరలి వచ్చారు.

గౌరవ అతిథిగా శ్రీ డా. పెమ్మసాని చంద్రశేఖర్‌, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్‌ శాఖ సహాయ మంత్రి గారు ఇంటర్నెట్‌ ద్వారా తన అమూల్యమైన సందేశాన్ని వినిపించారు. ప్రవాసాంధ్రులు తమ మాతృ భూమికి సహాయ సహకారాలు అందించవలసిందిగా పిలుపునిచ్చారు.

జనసేన ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ గారు, మాచర్ల ఎంఎల్‌ఎ  జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌, తెలుగు దేశం జనరల్‌ సెక్రటరీ గన్నీ కృష్ణ గారు తమ సందేశాలను పంపారు.

కలసికట్టుగా పనిచేసి ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్ర బాబు గారికి, పవన్‌ కళ్యాణ్‌ గారికి, పురంధేశ్వరి గారికి, లోకేష్‌ బాబు గారికి శుభాకాంక్షలు తెలిపారు. పండ్లతో చేసిన పలు ఆకృతులు సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 70 రకాల పసందైన ఆంధ్ర వంటకాలు అతిథులని జన్మభూమిని తిరిగి గుర్తు చేశాయి నాలుగేళ్ల చిన్నారి ఆలపించిన ‘‘కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా’’ గీతం శ్రోతలని విశేషంగా ఆకట్టుకుంది. ఫాదర్స్‌ డే ను పురస్కరించుకుని కూటమి సభ్యులు మరియు చిన్నారులు కలిసి కేకు ను కోసి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

 

Click here for Photogallery

 

 

Tags :