న్యూయార్క్ లో కూటమి విజయదరహాసం
న్యూయార్క్ నగరంలో తెలుగు తమ్ముళ్లు, మరియు ఎన్‌డీఏ సానుభూతి పరులు కలసి ఆంధ్రప్రదేశ్ ప్రజా విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమి సునామి సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భగా జూన్ 22న న్యూయార్క్ నగరంలోని జేరికో పట్టణంలో వేడుకలు వెంకటేశ్వరావు వోలేటీ, ప్రసాద్ కోయి, అశోక్ అట్టాడ మరియు దిలీప్ ముసునూరు వంటి పెద్దల సహకారంతో ఘనంగా నిర్వరించారు.
ఈ వేడుకల్లో వక్తలు డా.తిరుమలరావు తిపిర్నేని, కోటేశ్వరరావు బొడ్డు, అంజు కొండబోలు, డా.జగ్గారావు అల్లూరి, డా.పూర్ణచంద్ర రావు అట్లూరి, డా.కృష్ణారెడ్డి గుజవర్తి, మాజీ తానా ప్రెసిడెంట్ జయ్ తాళ్లూరి, సత్య చల్లపల్లి, ఉదయ్ దొమ్మరాజు, సుమంత్ రామిశెట్టి మరియు ఆర్గన్కెజర్లు వేంకటేశ్వర రావు వోలేటీ, ప్రసాద్ కోయి, అశోక్ అట్లాడ, దిలీప్ ముసునూరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వము మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను, బాధ్యతను గుర్తూ చేస్తే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని పనులు చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
రామోజీ రావు గారికి ఘన నివాళి
మీడియా మొఘల్, పద్మవి భూషన్ అవార్డు గ్రహీత, ఎందరో కళకారులకి, విలేకర్లకు జీవితాన్నిచ్చిన శ్రీ చెరుకూరి రామోజీ రావు గారికి ఘన నివాళులు అర్పించారు. ఆయన తెలుగు జాతికి తెచ్చిన గుర్తింపు ని పలువురు వక్తలు స్మరించుకొంటూ సందేశం ఇచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు.