నార్త్ కరోలినా పర్యటనలో నిరంజన్ టీమ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్న నిరంజన్ శృంగవరపు తన ప్రచార యాత్రలో భాగంగా నార్త్ కరోలినాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానా ద్వారా తాను చేసిన పనులు చూసి తనను, తన టీమ్‌ను గెలిపించాలని కోరారు. తానా ఫౌండేషన్ ద్వారా కోవిడ్ కష్టకాలంలోనూ, ఇతర సమయాల్లోనూ కమ్యూనిటీకి ఎంతో సేవ చేశానని, తానాను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా అవసరమైన మార్పులకోసం తమ టీమ్ ప్రయత్నిస్తోందని ఇందుకు మీరంతా మద్దతు ఇచ్చి తమను గెలిపించాలని కోరారు. తమ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలను ఆయన సభికులకు వివరించి తమ విజయానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. తానాలో ప్రతి పైసాకు, పనికి జవాబుదారీతనం ఉండాలన్న ఉద్దేశ్యంతో తానా ఫర్ ఛేంజ్ నినాదం తీసుకువచ్చామన్నారు. ఈ వారం ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌లో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఒక రాజకీయ పార్టీకి వ్యక్తిగత అభిమానం ఉండటం నేరం కాదని, కానీ తానాకు ఒక పార్టీని అంటగట్టడం తప్పు అనేది తన భావనగా మాత్రమే చెప్పానని ఆయన వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నిరంజన్ ప్యానెల్ నుండి కొల్లా అశోక్‌బాబు, కసుకుర్తి రాజా, వేమూరి సతీష్, తాళ్లూరి మురళీ, గోగినేని కిరణ, శశాంక్ యార్లగడ్డ, రామిశెట్టి సుమంత్, గుదె పురుషోత్తమ చౌదరి, తూనుగుంట్ల శిరీష, కటికి ఉమా, వడ్లమూడి హితేష్, ఓరుగంటి శ్రీనివాస్, నిమ్మలపూడి జనార్ధన్, తానా తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. అప్పలాచియన్ ప్రాంతీయ ప్రతినిధి సురేష్ కాకర్ల, తానా రాలే స్థానిక బందం ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా వ్యవహరించారు.