తానా ఎన్నికలు 2021-23.. విజేత నిరంజన్ శృంగవరపు- టీమ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఎన్నికలలో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ అందరూ ఊహించినట్టుగానే భారీ విజయకేతనం ఎగరవేసింది. గత నాలుగు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను మరిపించేలా సాగిన తానా ఎన్నికల ప్రచారం చివరకు నిరంజన్ ప్యానెల్ విజయంతో ముగిసింది. నిరంజన్ శృంగగవరపు తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలి పై 1758 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది తానా ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. ఈ ఎన్నికల్లో అనుభవానికా, మార్పుకా అన్న నినాదంపైనే జరిగాయి. నరేన్ కొడాలి టీమ్‍కు మద్దతుగా తానా మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, గంగాధర్ నాదెళ్ళ, సతీష్ వేమన ప్రచారం చేశారు. తమ అనుభవాన్ని చూసి నరేన్ కొడాలిని ఎన్నుకోవాలని వారు కోరారు. నిరంజన్ టీమ్ తరపున ప్రస్తుత అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, కాబోయే అధ్యక్షుడు అంజయ్యచౌదరి లావు ప్రచారం చేసి తానాలో మార్పులు తీసుకురావాల్సిన సమయం వచ్చిందని నిరంజన్ టీమ్‍కు ఓటువేసి మార్పుకు స్వాగతం పలకాలని వారు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. రెండు టీమ్‍లు చేసిన పోటాపోటీ ప్రచారాలు, చివరకు సభ్యులు తాము మార్పును కోరుతున్నామంటూ నిరంజన్ టీమ్‍ను గెలిపించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) కార్యనిర్వాహక సంఘానికి 2021-23 సంవత్సరానికిగాను జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా నిరంజన్ శృంగగవరపు ఎన్నికయ్యారు. 2023-25 సంవత్సరంలో ఆయన తానా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కాగా ఈసారి ఉపాధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం నిరంజన్ శృంగగవరపు, నరేన్ కొడాలి మధ్యనే సాగింది. ఈ ఎన్నికల్లో నిరంజన్‍కు 10,866 ఓట్లు, నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చింది. తన అంటే ఒక్కడిది...‘తానా’ అంటే అందరిది అన్న నినాదంతో నిరంజన్ శృంగవరపు ప్రచారపర్వంలోకి దూసుకుపోయారు. దాంతోపాటు తాను తానాలో చేసిన సేవలను ఓ పుస్తకరూపంలో తీసుకువచ్చి ఇవే నేను చేసిన సేవలు అంటూ చూపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఎప్పటికప్పుడు తన వెబ్‍సైట్‍లో తన ప్రచార కార్యక్రమాలను, చేయనున్న, చేయబోతున్న పనులను తెలియజేస్తూ, మరోవైపు ప్రతివారం తానా సభ్యులకు ఇ-మెయిల్ ద్వారా లేఖలు రాసి వారిని ఆకట్టుకున్నారు. చివరకు ఆయన ప్రచార వ్యూహాలు, అండగా నిలిచిన తానా ప్రస్తుత అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, కాబోయే అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు ప్రసంగాలు ఆయన విజయానికి బాటలను వేశాయి.
తానా 2021-23 ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలు
ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు....
నిరంజన్ శృంగవరపు (ప్రెసిడెంట్ ఎలక్ట్)
సతీష్ వేమూరి (సెక్రటరీ)
మురళీ తాళ్ళూరి (జాయింట్ సెక్రటరీ)
అశోక్‍బాబు కొల్లా (ట్రెజరర్)
భరత్ మద్దినేని (జాయింట్ ట్రెజరర్)
శశాంక్ యార్లగడ్డ (స్పోర్టస్ కో ఆర్డినేటర్)
డా. ఉమ ఆర్ కటికి (ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్)
శిరీష తూనుగుంట్ల (కల్చరల్ సర్వీసెస్ కో ఆర్డినేటర్)
రాజా కసుకుర్తి (కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్)
లోకేష్ కొణిదెల (కౌన్సిలర్ ఎట్ లార్జ్)
హితేష్ వడ్లమూడి (ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్)
ఫౌండేషన్ ట్రస్టీ సభ్యులు...
కిరణ్ గోగినేని
వినయ్ మద్దినేని
శ్రీకాంత్ పోలవరపు
ఓరుగంటి శ్రీనివాస్
గూడె పురుషోత్తమ చౌదరి
విద్యాధర్ గారపాటి
బోర్డ్ డైరెక్టర్స్...
డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి
జనార్థన్ నిమ్మలపూడి
లక్ష్మీదేవినేని
రీజినల్ రిప్రజెంటేటివ్స్
ప్రదీప్ గడ్డం (న్యూఇంగ్లాండ్)
వంశీ వాసిరెడ్డి (న్యూజెర్సి)
సునీల్ కోగంటి (మిడ్ అట్లాంటిక్)
సాయి బొల్లినేని (నార్త్ సెంట్రల్)
హనుమంతరావు చెరుకూరి (మిడ్‍వెస్ట్)
సతీష్ కొమ్మన (డిఎఫ్‍డబ్ల్యు)
దిలీప్ ముసునూరు (న్యూయార్క్)
నాగమల్లేశ్వర పంచుమర్తి (అప్పలాచియాన్)
కిషోర్ యార్లగడ్డ (సౌత్ సెంట్రల్)
రత్నప్రసాద్ గుమ్మడి (సౌత్ వెస్ట్)
చెరుకూరి ప్రతాప్ (సదరన్ కాలిఫోర్నియా)
రామ్ తోట (నార్తర్న్ కాలిఫోర్నియా)
పద్మ భోగవల్లి (నార్త్ వెస్ట్)
సరిత్ కొమ్మినేని (రాకీ మౌంటెన్స్)
రవిచంద్ర వడ్లమూడి (ఒహాయో వ్యాలీ)
శ్రీనివాస్ ఉయ్యూరు (క్యాపిటల్)
వెంకట్ మీసాల (సౌత్ ఈస్ట్)
శ్రీనివాస్ గోగినేని (నార్త్)
తానా 2021-23 ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన ఓట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బోర్డ్ పదవికి పోటీ పడిన సభ్యులకు లభించిన ఓట్లు
గుడిసేవ విజయ్ - 9193
కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ - 11116
నిమ్మలపూడి జనార్ధన్ - 10971
రవి పొట్లూరి - 9676
మొత్తం: 40956
ఉపాధ్యక్ష పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు
నిరంజన్ శృంగవరపు -- 10,866
గోగినేని శ్రీనివాస -- 741
కొడాలి నరేన్ -- 9108
మొత్తం: 20715
ట్రెజరర్ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు
కొల్లా అశోక్ బాబు -- 11,465
ప్రభల జగదీష్ కే -- 9,168
మొత్తం: 20,633
జాయింట్ సెక్రటరీ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు
కొగంటి వెంకట్ -- 9,377
తాళ్లూరి మురళి -- 11,277
మొత్తం: 20,654
జాయింట్ ట్రెజరర్ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు
మద్దినేని భరత్ - 11058
పంత్రా సునీల్ - 9621
మొత్తం: 20679
కమ్యూనిటీ సర్వీసెస్ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు
కాకర్ల రజినీకాంత్ -- 9,571
కసుకూర్తి రాజా -- 11,420
మొత్తం: 20,665
కల్చరల్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు
తుమ్మల సతీష్ -- 9,216
తునుగుంట్ల శీరిష -- 11,451
మొత్తం: 20,667
ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు
దువ్వురి చాందిని -- 9,558
కటికి ఉమా ఆర్ -- 11,153
మొత్తం: 20,711
స్పోర్టస్ కో ఆర్డినేటర్ పదవికి పోటీ పడిన అభ్యర్థులకు పోలైన ఓట్లు
ఉప్పలపాటి అనిల్ చౌదరి -- 9,259
యార్లగడ్డ శశాంక్ -- 11,420
మొత్తం: 20,679
ఫౌండేషన్ ట్రస్టీలు
పోలవరపు 11322
కిరణ్ గోగినేని 11085
ఓరుగంటి 10819
పురుషోత్తం 10774
మద్దినేని వినయ్ 10514
ఎండూరి 9416
సత్యనారాయణ మన్నె 9184
రాజా సూరపనేని 9618
వరప్రసాద్ వై 8302
ఫౌండేషన్ డోనర్ ట్రస్టీ (2 పదవులు) పదవికి పోలైన ఓట్లు
కిరణ్ -- 48
గారపాటి విద్యాధర్ -- 54
నల్లూరి ప్రసాద్ రావు - 49
శశికాంత్ వల్లేపల్లి - 64
మొత్తం: 215
రీజనల్ కోఆర్డినేటర్ - న్యూజెర్సీ
అద్దంకి పద్మలక్ష్మీ -- 371
వాసిరెడ్డి వంశీక్రిష్ణ -- 706
మొత్తం: 1,077
రీజనల్ కోఆర్డినేటర్ డీఎఫ్‍డబ్ల్యూ
కొమ్మన్న సతీష్ -- 1,280
త్రిపురనేని దినేష్ -- 695
మొత్తం: 1,975
రీజనల్ కోఆర్డినేటర్ మిడ్‍వెస్ట్
చెరుకూరి హనుమంతరావు -- 446
కొమ్మలపాటి శ్రీధర్ కుమార్ -- 373
మొత్తం: 819
రీజనల్ కోఆర్డినేటర్ నార్త్ సెంట్రల్
బొల్లినేని సాయి -- 240
యార్లగడ్డ శ్రీమన్నారాయణ -- 130
మొత్తం: 370
రీజనల్ కోఆర్డినేటర్ మిడ్ అట్లాంటిక్
జాస్తీ శశిధర్ - 291
కొగంటి సునీల్ కుమార్ -- 535
మొత్తం:826
రీజనల్ కోఆర్డినేటర్ న్యూ ఇంగ్లాండ్
గడ్డం ప్రదీప్ కుమార్ -- 1052
యలమంచిలి రావు -- 369
మొత్తం: 1421
కర్నూలు జిల్లా శిరివెళ్ల్ల మండలం రాజానగరం గ్రామానికి చెందిన నిరంజన్ తానాలో అంచెలంచెలుగా ఎదిగి వివిధ పదవులను నిర్వహించారు. ప్రస్తుతం తానా ఫౌండేషన్ చైర్మన్‍గా ఉన్న నిరంజన్ శృంగవరపు ఈ ఎన్నికల్లో సత్తా చాటి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తరువాత అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు.
ఈ ఎన్నికల్లో ఇతర పదవులకు కూడా జరిగిన ఎన్నికల్లో నిరంజన్ టీమ్ ఘనవిజయం సాధించింది. నిరంజన్ టీమ్‍లో ఉన్న సతీశ్ వేమూరి కార్యదర్శిగా, హితేశ్ వడ్లమూడి ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్‍గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శిగా మురళి తాళ్లూరి, కోశాధికారిగా కొల్లా అశోక్‍బాబు, సంయుక్త కోశాధికారిగా భరత్ మద్దినేని, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్‍గా రాజా కసుకుర్తి, కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్‍గా శిరీష తూనుగుంట్ల, మహిళా సేవల సమన్వయకర్తగా డాక్టరు ఉమా కటికి, క్రీడల సమన్వయకర్తగా శశాంక్ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ ట్రస్టీలుగా కిరణ్ గోగినేని, పురుషోత్తం చౌదరి గుదె, శ్రీకాంత్ పోలవరపు, శ్రీనివాస్ ఓరుగంటి, వినయ్ మద్దినేని విజయం సాధించారు. బోర్డు సభ్యులుగా నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, జనార్దన్ నిమ్మలపూడి ఎన్నికయ్యారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా జరిగిన ఈ ఎన్నికలు ఒక విధంగా తానా చరిత్రను మార్చినట్లే కనిపిస్తోంది. ఓవైపు టీమ్ సభ్యులంతా గెలవడమే ఇందుకు నిదర్శనం. ఫుల్ ప్యానెల్ స్వీప్ చెయ్యడంతో నిరంజన్ టీం తానాలో సరికొత్త చరిత్ర స•ష్టించింది అని చెప్పడంలో సందేహం లేదు.