తానా బోర్డ్...ఎన్నికల వెబ్ సైట్‌లో నామినేషన్ పత్రాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల నోటిఫికేషన్ ను ఇటీవల వెలువరిస్తూ తానా బోర్డ్ నిర్ణయం తీసుకుని నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్నికల కమిటీని కూడా బోర్డ్ నియమించింది. అయితే తానా బోర్డ్‌కు, తానా ఎగ్జిక్యూటివ్ కమిటీకి మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌లో ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ను అధికారికంగా తానా వెబ్ సైట్‌లో పెట్టకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీ అనధికారికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో చాలామంది సభ్యులు తానా ఎన్నికల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపించిన చాలామంది నామినేషన్ పత్రాల కోసం తానా వెబ్ సైట్‌లో చూస్తున్నారు.
కాని ఎగ్జిక్యూటివ్ కమిటీలోని ఓ వర్గం ఈ ఎన్నికలను నిర్వహించరాదని బోర్డ్‌లోని ఓ వర్గం ఎన్నికలు నిర్వహించి తీరాలని పట్టు వదలకుండా ఉండటంతో తానా ఎన్నికల ప్రకటన తరువాత నామినేషన్ ఇతర విషయాల్లో అధికారికంగా ప్రకటన వెలువడని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తానాకు సుప్రీం అయిన బోర్డ్ తీర్మానాన్ని ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా పాటించాల్సి ఉన్నా వర్గ పోరు కారణంగా ఈ ఎన్నికల నోటిఫికేషన్ చాలామందికి అధికారికంగా తెలియలేదు. ఇప్పుడు బోర్డ్ సొంతంగా వెబ్ సైట్ ను ప్రారంభించి ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఇందులో పొందుపరిచింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసి కమ్యూనిటీకి సేవ చేయాలనుకున్న వారంతా నామినేషన్ పత్రాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా తీసుకుని పోటీ చేయవచ్చని బోర్డ్ పేర్కొంది.
బోర్డ్ వెబ్ సైట్ లింక్
http://www.tanabod.org/index.html