ASBL Koncept Ambience

మహాసభలకు వస్తున్న ఎన్నారైలు

మహాసభలకు వస్తున్న ఎన్నారైలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి ఎన్నారైలు పాల్గొంటున్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఈ మహాసభల్లో వివిధ దేశాల నుంచి ఎన్నారైలు పాల్గొనేలా చేయాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో నిర్వాహకులు, ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో ప్రపంచ మహాసభల సన్నాహక సదస్సులను ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించారు. మహాసభల నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు పలువురు ఎన్నారైలు వివిధ దేశాల నుంచి ప్రపంచ మహాసభలకు హాజరవుతున్నారు.

అమెరికా నుంచి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షులు ప్రసాద్‌ తోటకూర, జంపాల చౌదరి, తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, వంగూరి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు వంగూరి చిట్టెన్‌ రాజు, సిలికానాంధ్ర సంస్థ నుంచి దీనబాబుతోపాటు తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు, మోహన్‌ పాటలోళ్ళ, కిరణ్‌ ప్రభ, వెల్చేరు నారాయణరావు, ఆర్‌.ఎ. సీతారామయ్య, సతీష్‌ గొల్లపూడి, వి. హరికృష్ణ, మధు కె రెడ్డి, అఫ్సర్‌, కల్పన రెంటాల విజయ్‌ పాల్‌ రెడ్డి, గొర్తి బ్రహ్మానందం, చంద్ర కన్నెగంటి, కె. గీత, తాటికొండ శివకుమార్‌ శర్మ, తమ్మినేని వేడుకల భూషణ్‌, వైదేహి, శశిధర్‌లు యుఎస్‌ నుంచి వస్తున్నారు.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి వీరేందర్‌ శర్మ, వింజమూరి రాగసుధ, సాధిక్‌ ఖాన్‌ (లండన్‌ మేయర్‌), ఆస్ట్రేలియా నుంచి ధర్మపురి మురళీ, మల్లికేశ్వర్‌రావు కొంచాడ, మలేషియా నుంచి అచ్చయ్‌ కుమార్‌ నాయకత్వంలో 85 మంది బృందం. అందులో 25 మంది పిల్లలు ఉన్నారు. మారిషస్‌ నుంచి డా. రెడ్డి లక్ష్మడు, డా రామస్వామి, కొసరాజు శరత్‌, డా. సంజీవ్‌ అప్పడు, దక్షిణాఫ్రికా నుంచి రాపోలు సీతారామరాజు, జెరూసలెం నుంచి డా. డేవిద్‌ సుకుమార్‌, పారిస్‌ డా. డేనియల్‌ వెగాస్‌, రష్యా నుంచి డా. దర్శిక బొలన తదితరులు విదేశాల నుంచి మహాసభలకు తరలివస్తున్నారు.

 

Tags :