సియోటెల్ లో లోకేష్ మీటింగ్...ఎన్నారైలకు ఆహ్వానం
నవాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ అండ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడి ఎన్నారైలతో, పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతున్నారు. వివిధ సభలు, సదస్సుల్లో పాల్గొని మాట్లాడుతున్నారు. సన్ రైజ్ స్టేట్ లో పెట్టుబడులు పెట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎన్‌ఆర్‌ఐ టిడిపి నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. సియోటెల్ లో జరిగిన ఎన్నారై టీడీపీ నేతల సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ఎన్‌ఆర్‌ఐలు అంతా బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు. అంతే కాదు...గడిచిన మూడేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిన సంగతి ప్రస్తావించారు. ముఖ్యంగా గ్రామీణాభివద్ధిలో భాగంగా సిసి రోడ్లు, ఎల్‌ఈడి లైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పంచాయతీ రాజ్ భవనాలు, అంగన్ వాడీ కేంద్రాల ఏర్పాటు చేస్తున్న సంగతులను ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి. సన్ రైజ్ స్టేట్ లో జరుగుతున్న అభివృద్ధి గురించి మీరు ఇక్కడ ప్రచారం చెయ్యాలని ఎన్నారైలను ప్రత్యేకంగా లోకేష్ కోరారు.
ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతోందని ఎన్నారైలకు వివరించారు మంత్రి లోకేష్. కియా లాంటి కార్ల కంపెనీ రాష్ట్రానికి వచ్చి తన సేవలను విస్తరించిన సంగతిని ప్రస్తావించారు మంత్రి. అంతే కాదు..ఆంధ్రప్రదేశ్ లో ఐటి రంగం అభివద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్న సంగతిని వివరించారు. కియోనే కాదు.. ఫ్రాంక్లిన్, హెచ్ సిఎల్, ఎఎన్‌ఎస్‌ఆర్, కాన్డ్యూయెంట్, జోహో లాంటి కంపెనీలు రాష్ట్రానికి వచ్చిన సంగతిని గుర్తు చేశారు. అలానే అపోలో టైర్స్, ఇసుజులాంటి కంపెనీలు ఉన్న సంగతి చెప్పారు. ఆ కంపెనీలు ఏపీకి రావడం వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు.
ఎన్‌ఆర్‌ఐ లకు నైపుణ్య అభివద్ధి శిక్షణ ఇవ్వబోతున్న విషయాన్ని ప్రస్తావించారు. దీనికి అందరూ సహకరించాలని కోరారు మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నారైలు అంతా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి తమ రాష్ట్రాభివద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు.