ఏపీలో కూటమి విజయం పై... కొలరాడోలో విజయోత్సవం
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయాన్ని పురస్కరించుకుని అమెరికాలోని కొలరాడోలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో నడుస్తుందని, సస్యశ్యామల విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందని, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పలువురు వక్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అరాచక పాలనకు ప్రజలు తమ ఓటుతో చరమగీతం పాడారన్నారు. కక్షలు, కార్పణ్యాల రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్‌లో తావులేదని చంద్రబాబుకు ఏకపక్ష విజయం అందించడం ద్వారా ప్రజలు నిరూపించారని చెప్పారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
Tags :