బహ్రెయిన్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు
ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు 64వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బహ్రెయిన్ ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని పబ్లిక్ గార్డెన్‌లో మొక్కలను నాటారు. అనంతరం ప్రెసిడెంట్ రాధారపు సతీశ్ కుమార్ మాట్లాడుతూ... అప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ పెట్టి రాష్ర్టాన్ని కొట్లాడి తెచ్చి తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల అభివృద్ధికై అహర్నిశలు కష్టపడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఆయన ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పథకాలను వినూత్న రీతిలో సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
గల్ఫ్ దేశాల్లో ఉండి కూడా కేసీఆర్ పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్ బహ్రెయిన్‌కు సలహాలు, సూచనలు అందిస్తూ సెల్‌ను ప్రోత్సహిస్తున్న ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాలకు, పార్టీ నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్ బొలిశెట్టి, జనరల్ సెక్రటరీలు లింబాద్రి, రవి, సెక్రటరీలు రవి పటేల్, రాజేందర్, జాయింట్ సెక్రటరీలు దేవన్న, సుధాకర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాజేశ్, నర్సయ్య, రాజు, రాజేందర్, భజన్న, వెంకటేశ్, సాయన్న, వసంత్, గంగారం తదితరులు పాల్గొన్నారు.