రైతుబంధు, దళితబంధు చరిత్రలో నిలిచిపోతాయి
రైతుబంధు, దళితబంధు పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ద్విశతాబ్ధి వేడుకల్లో మహేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతున్నారని ప్రశంసించారు. ఎన్‌ఆర్‌ఐలకు మొట్టమొదటి సారి కేసీఆర్ తరపున అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించినందుకు మహేష్ బిగాల కృతజ్ఞతలు తెలిపారు.
Tags :