ASBL Koncept Ambience

టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి : అనిల్ కూర్మాచలం

టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి : అనిల్ కూర్మాచలం

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీలో కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలని ఎన్నారై టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజామాద్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గత 5 సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం కృషి చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లండన్‌ వీధుల్లో రాష్ట్ర ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ పోరాటాలు చేసిన మేము మళ్ళీ పసుపు బోర్డు కోసం కవిత పోరాటానికి సంఘీభావంగా లండన్‌లో నిరసన కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. దీన్ని బట్టి నిజామాబాద్‌ రైతులు, ప్రజలు పసుపు బోర్డు కోసం చేసిన కృషిని గుర్తించి కవితను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా కావాల్సినవన్నీ సాధించుకుందమన్నారు. జాతీయ పార్టీలని చెప్పుకునే కాంగ్రెస్‌, బీజేపీలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ది రాలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గుర్తు రాని హామీలు ఇప్పుడు ఓట్ల కోసం, సీట్ల కోసం గుర్తుకు వస్తున్నాయని ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీలను ఓడించాలన్నారు.

 

 

Tags :