కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఎన్నారైలు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ఎన్నారై తెరాస విభాగాల ఆధ్వర్యంలో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెరాస ఎన్నారై విభాగ సమన్వ్యకర్త మహేష్ బిగాల తెలిపారు. న్యూజీల్యాండ్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తెరాస న్యూజీలాండ్ అధ్యక్షుడు విజయ్ రెడ్డి కోసన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, బహరైన్, ఖతార్, సింగపూర్, జాంబియా, పెరూ తెరాస శాఖల అధ్యక్షుల ఆధ్వర్యంలో యూరప్ లోని డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, ఆస్ట్రియా, పోలాండ్, ఇటలీ, నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ తెరాస శాఖలు అధ్యక్షులు మరియు తెరాస డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్ బాబు ఆకుల సమన్వయంతో వివిధ రకాల వేడుకలు జరపబోతున్నట్టు మహేష్ తెలిపారు. పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత సలహాలు, సూచనలతో ఎన్నారై తెరాస శాఖలు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలు కీలకపాత్ర పోషించేలా ఎన్నారై విభాగం పనిచేస్తోందని మహేష్ బిగాల పేర్కొన్నారు.