ASBL Koncept Ambience

నాట్స్‌ సంబరాలలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు

నాట్స్‌ సంబరాలలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శతజయంతి వేడుకలను జరుపకుంటున్న తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను ఈ సంబరాల్లో వైభవంగా జరుపుకుంటున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన యోధునిగా, తన నటనతో, హావభావాలతో, వేషధారణతో మెప్పించి తెలుగువారి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్‌ను నాట్స్‌ సంబరాల వేదికపై స్మరించుకునేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 

 

 

Tags :