ASBL Koncept Ambience

ఎన్టీవీ చైర్మన్‌ నరేంద్రచౌదరికి తానా జీవనసాఫల్య పురస్కారం

ఎన్టీవీ చైర్మన్‌ నరేంద్రచౌదరికి తానా జీవనసాఫల్య పురస్కారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు వాషింగ్టన్‌ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతి మహాసభల్లో తానా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డులను ఈసారి కూడా పలువురు ప్రముఖులకు ఇస్తున్నారు. ఈసారి తానా జీవన సాఫల్య పురస్కారంను ఎన్‌టీవి చైర్మన్‌ తుమ్మల నరేంద్ర చౌదరికి ఇవ్వనున్నారు. తానా ఎన్టీఆర్‌ కల్చరల్‌ అవార్డ్‌ను ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణకు ఇస్తున్నారు. గుత్తికొండ రవీంధ్రనాథ్‌ సర్వీస్‌ అవార్డ్‌ను డా. గంగా చౌదరి, తానా గిడుగు రామ్మూర్మి అవార్డును డా. గారపాటి ఉమమహేశ్వర్‌రావుకు ఇస్తున్నారు. 

తానా ప్రెసిడెంట్‌ అవార్డులను భారత్‌ బయోటెక్‌ సిఇఓ కృష్ణ ఎల్లా, గ్లోబల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ రవీంద్రనాథ్‌ కంచెర్లకు ఇస్తున్నారు. 

తానా ఎక్స్‌లెన్సీ అవార్డ్స్‌ను 12 మందికి ప్రకటించారు. తానా మెరిటోరియస్‌ అవార్డులను కూడా ప్రకటించారు. 12 మందికి ఈ అవార్డులను అందజేయనున్నట్లు తానా కాన్ఫరెన్స్‌ అవార్డుల కమిటీ ప్రకటించింది.

 

Tags :