వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు
అమెరికా అధ్యక్షుడు ఒరాక్ ఒబామా తొలిసారి తన అధికారిక కార్యాలయంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. తన తర్వాత వచ్చిన అధ్యక్షులు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ 2009లో నేను, మిచెల్ దీపావళీ జరుపుకొన్నప్పడు భారతీయులు సంతోషించారు. మేము ముంబయి వెళ్లినప్పుడు మమ్మల్ని ఎంతో గౌరవంగా ఆహ్వానించారు. ఆ అనుభవాన్ని మర్చిపోలేను. దీపావళి సందర్భంగా ఈ సారి నా కార్యాలయంలో మొట్టమొదటి దీపం వెలిగించిన అనుభవం మర్చిపోలేను. దీనిని చూస్తే చీకటి తర్వాత వెలుగు వస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ సంప్రదాయాన్ని భవిష్యత్తులో వచ్చే అధ్యక్షులు కూడా పాటిస్తారని భావిస్తున్నాను. మీరు, మీకు ఇష్టమైనవారు ఈ దీపావళి సుఖసంతోషాలతో ఉండాలని తన కుటుంబం తరపున కోరుకుంటున్నాను అని అన్నారు.
Tags :