ASBL Koncept Ambience

గేటెడ్ కమ్యూనిటీ కోసం తిరుపతిలో ఓబిలి కొత్త ప్రాజెక్టు

గేటెడ్ కమ్యూనిటీ కోసం తిరుపతిలో ఓబిలి కొత్త ప్రాజెక్టు

హైదరాబాద్‍, బెంగళూరు, తిరుపతిలో రియల్‍ ఎస్టేట్‍రంగంలో పేరున్న ఓబిలి ఒకటి. ఆ రోజులలోనే డా।। వైఎస్‍ రాజశేఖర్‍ రెడ్డి ముఖ్యమంత్రిగా హైదరాబాద్‍లో 2009లో ప్రతిష్టాత్మకమైన ఓబిలి గ్రీన్‍ సిటీ ప్రాజెక్టుని లాంచ్‍ చేసిన సంగతి చాలా మందికి తెలుసు. అలాగే బెంగళూరులో ప్రస్తుతం ఉన్న ఏర్‍పోర్ట్కి• దగ్గరలో హటన్‍హళ్ళిలో కూడా ఓబిలివారి వెంచర్‍ ఉన్న విషయం చాలా మందికి తెలిసిందే. దాదాపు 25 సంవత్సరాలుగా బిజినెస్‍లోను, రియల్‍ ఎస్టేట్‍రంగంలోనూ అపారమైన అనుభవం ఉన్న ఓబిలి రామచంద్రారెడ్డి తాజాగా ఓబిలి బ్రాండ్‍ కింద తిరుపతిలో 7 ఎకరాల స్థలంలో పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

మూడు ఫేజులలో నిర్మాణం జరిగే ఈ ప్రాజెక్టులో ఫేజ్‍ 1లో 1.71 ఎకరాల స్థలంలో ఓబిలి గరుడ పేరుతో గేటెడ్‍ కమ్యూనిటీ ప్రాజెక్టును అతి త్వరలో ప్రారంభిస్తున్నట్లు ఇది ఉద్యోగులకు, మధ్య  తరగతి వారికి చాలా అనువైన, అనుకూలమైన  ప్రాజెక్ట్ అవుతుందని శ్రీ రామచంద్రా రెడ్డి తెలిపారు.

ఈ ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో ప్లానింగ్‍ జరిగిందని అన్ని అనుమతులు తీసుకోవడం కూడా అయిందని, ఈ కరోనా పరిస్థితి నుంచి బయటకు రాగానే జూలై, ఆగస్టు నెలలో నిర్మాణం మొదలు పెట్టి 20-24 నెలలో పూర్తి చేస్తామని తెలిపారు.

ఏరియాపరంగా తిరుపతిలో అందరికి అనువైన స్థలం దొరకటం వలననే ఈ నిర్మాణం మొదలు పెడుతున్నామని  తెలుపుతూ స్థలం రేణిగుంట జంక్షన్‍కి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందని, ఎయిర్‍పోర్ట్ 4 కి.మీ. రేణిగుంట రైల్వే స్టేషన్‍ 1/2 కిలోమీటరు ఉందని 24 గంటల బస్సు సౌకర్యం ఉందని తెలిపారు. అలాగే దగ్గరలోనే టీసీఎల్‍, డిక్సన్‍, సెల్‍కాన్‍, ఐటీ ఇన్‍క్యూబేషన్‍ సెంటర్‍, ఐటీ సెజ్‍తోపాటు పలువిద్యాసంస్థలు, అమర్‍రాజా వారి హాస్పిటల్‍ ఉన్నాయని శ్రీ రామచంద్రారెడ్డి తెలిపారు.

అలాగే గేటెడ్‍ కమ్యూనిటీకి ఉండాల్సిన సకల సౌకర్యాలను ఇందులో సమకూర్చామని చెప్పారు. స్విమ్మింగ్‍ పూల్‍, క్లబ్‍ హౌజ్‍, జిమ్‍, చిల్డ్రన్‍ ప్లే ఏరియా, ఇండోర్‍ ఔట్‍డోర్‍ గేమ్స్, కార్‍వాష్‍ ఏరియా, రిటైల్‍ షాప్‍, మెడికల్‍ షాప్‍, ఎమర్జెన్సీ క్లినిక్‍లాంటి అన్నీ వసతులతో ఈ గేటెడ్‍ ప్రాజెక్టు అన్నీ వసతులతో అలరిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టుని జూలై - ఆగస్టు నెలల్లో నిర్మాణపు పనులు మొదలుపెడుతామని తెలిపారు. ఆ సమయంలోనే ఫేజ్‍ 1లో ఉన్న 160 అపార్ట్మెంట్స్ విక్రయాలు కూడా ప్రారంభమవుతాయని చెప్పారు. స్క్వేర్‍ ఫీట్‍ రూ.3000 నుంచి రూ.3200గా రేటుని నిర్ణయిస్తామని తెలిపారు. అయితే ముందుగా తెలిసిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ప్రీలాంచ్‍ ఆఫర్‍గా ఒక 25 అపార్టుమెంట్‍లు ఇద్దామన్న  ఆలోచనలో ఉన్నామని, అదీ కూడా స్క్వేర్‍ ఫీట్‍ రూ.2000 గా నిర్ణయించి విక్రయిస్తామని  తెలిపారు.

ఆసక్తి కలవారు  వెంటనే శ్రీ రామచంద్రారెడ్డిని ఫోన్‍ ద్వారా ఈమెయిల్‍ ద్వారా సంప్రదించవచ్చు.

Obili Ramachandra Reddy
+91 9989401214
email: obilirr@gmail.com

 

Tags :