ASBL Koncept Ambience

తానా మహాసభల వేదికపై ‘ఆస్కార్’ చంద్రబోస్‌కు ఘన సత్కారం

తానా మహాసభల వేదికపై ‘ఆస్కార్’ చంద్రబోస్‌కు ఘన సత్కారం

తెలుగు వారికి తొలి ఆస్కార్ అందించిన లిరిసిస్ట్ చంద్రబోస్‌కు తానా మహాసభల్లో ఘనసత్కారం జరిగింది. వేద మంత్రాలతో ఆయన్ను ఆశీర్వదించిన అనంతరం చంద్రబోస్‌ను తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి సత్కరించారు. చంద్రబోస్ తనకు వచ్చిన ఆస్కార్ అవార్డును కూడా ఈ వేడుకలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో పూర్తి భారతీయ చిత్రానికి వచ్చిన తొలి ఆస్కార్ ఇది. ఈ అవార్డు నాదో, కీరవాణి గారిదో, ఆర్ఆర్ఆర్ చిత్రానిదో మాత్రమే కాదు.. తెలుగు భాషది, యాసది, తెలుగు జాతిది, తెలుగు సంగీతానిది, తెలుగు సాహిత్యానిది, తెలుగు చరిత్రది, తెలుగు వారసత్వానిది’ అని చెప్పారు. చివర్లో ఆస్కార్ అందుకున్న ‘నాటు.. నాటు..’ పాట పాడి అందర్నీ అలరించారు. ‘ఆస్కార్ తర్వాత ఇంత పెద్ద వేదికపైకి నన్ను ఆహ్వానించి.. నన్ను, నా పురస్కారాన్ని సత్కరించిన తానా పెద్దలందరికీ ధన్యవాదాలు’ అంటూ తన ప్రసంగం ముగించారు.

 

 

 

 

Tags :