ASBL Koncept Ambience

తానా సభలకు వచ్చిన అందరికీ మంచి భోజనం పెట్టటమే మా లక్ష్యం.. ఫుడ్ కమిటీ

తానా సభలకు వచ్చిన అందరికీ మంచి భోజనం పెట్టటమే మా లక్ష్యం.. ఫుడ్ కమిటీ

23 వ తానా మహా సభలకు దాదాపు గా 10000 - 12000 మంది వస్తున్నారని, ఉదయం 10000 మంది, సాయంత్రం 12000 మందికి శనివారం, ఆదివారం భోజనాలు, శుక్రవారం జరిగే బాంక్వెట్ కి 4000 మంది వుంటారని, దాదాపు గా 450000 కి పైగా భోజనాలు తయారు చేస్తున్నామని శ్రీ కిరణ్ కొత్తపల్లి - ఫుడ్ కమిటీ చైర్ తెలిపారు. 

ఫుడ్ కమిటీ అడ్వైజర్ శ్రీ రవి వీరవల్లి మాట్లాడుతూ తానా కాన్ఫరెన్స్ లో అందరికి ఇష్టమైన వంటకాలతో భోజనాలు ఇవ్వాలని అందరం శ్రమ పడుతున్నామని, ఎన్నో కాన్ఫరెన్స్ లకు ఫుడ్ తయారు చేసిన తానా మాజీ అధ్యక్షులు శ్రీ జయరామ్ కోమటి కూడా ప్రస్తుతం మాతో పాటు కిచెన్ లో వుంటూ సలహాలు ఇస్తున్నారని తెలిపారు. 

ఈ మూడు రోజులకీ కావలసిన కూరలు కొన్ని లోకల్ గా, మరికొన్ని న్యూ జెర్సీ నుంచి, ఫ్లోరిడా నుంచి తెప్పిస్తున్నామని, మటన్, చికెన్, ఫిష్ లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఫ్రెష్ గా వుండేలా చూసుకొంటిన్నామని శ్రీ రవి వీరవల్లి తెలిపారు.

శ్రీ గోవర్ధన్ బొబ్బ, డెక్కన్ స్పైస్ రెస్టారెంట్, న్యూ జెర్సీ మాట్లాడుతూ తానా సభలకు ఫుడ్ చేసే అవకాశం ఇచ్చినందుకు తానా లీడర్ షిప్ ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 40 మంది వంట వాళ్ళు కిచెన్ లో, ఇంకో 30 మంది బయట పనిచేస్తున్నారని గత 20 రోజులు గా అనేకసార్లు ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్ కి వచ్చి, కిచెన్  లో వున్న సదుపాయలు చూసుకొని, ఫుడ్ కమిటీ వారి సలహా సూచనలతో  మూడు రోజుల మెను తయారు చేసుకోన్నామని, ఆ మెను ప్రకారం కూరలు, నాన్ వెజ్ ఐటమ్స్, ప్రొవిజన్స్ రెడీ చేసుకొన్నామని శ్రీ గోవర్ధన్ తెలిపారు.

డెక్కన్ స్పైస్ రెస్టారెంట్ చెఫ్ గజేంద్ర నాయుడు మాట్లాడుతూ గత రెండు రోజులుగా కూరలు పొట్టు తీయడం, ముక్కలు చేసుకోవడం, మాంసం ముక్కలు గా చేసుకోవడం, చట్నీలు చేసుకోవడం లాంటి పనులన్నీ చేసుకుంటున్నామని తెలిపారు.

ఒక పక్క ఫుడ్ కమిటీ వాళ్ళు, రెండో పక్క కిచెన్ లో వంట వాళ్ళు కష్ట పడుతున్నారని, వచ్చిన అందరూ తృప్తిగా రుచికరమైన భోజనం చేసి వెళ్ళాలని అందరి ప్రయత్నం అని తానా మాజీ అధ్యక్షులు శ్రీ జయరామ్ కోమటి తెలిపారు.

 

Click here for Photogallery

 

 

Tags :