తానా మహాసభలలో తెలుగు పోటీల ముగింపు వేడుక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలను పురస్కరించుకుని వివిధ నగరాల్లో పాఠశాల - తానా సంయుక్తంగా నిర్వహించిన తెలుగు పోటీలలో విజేతలైన పిల్లలలకు వాషింగ్టన్‌డీసీలో జూలై 4 నుంచి జరగనున్న తానా మహాసభలలో సెమి ఫైనల్స్ మరియు ఫైనల్స్ పోటీలను నిర్వహిస్తున్నారు. వివిధ నగరాల్లో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన తల్లితండ్రులు ఫోన్ లు, ఇమెయిల్ లు ద్వారా ఏలా రావాలి , మాకు పాస్ లు ఇస్తారా, ఎంట్రీ దగ్గర ఎం చెప్పాలి లాంటి ప్రశ్నలు, పోటీలు ఎలా ఉంటాయి లాంటి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిస్తున్నాము. అందరూ ఈ సెమిపైనల్, ఫైనల్ పోటీలకు రావాల్సిందిగా పత్రికాముఖంగా కోరుతున్నాము.
ఈ పోటీలను ఉత్సాహంగా అన్ని పట్టణాలలో నిర్వహించిన తానా - పాఠశాల నాయకులకు, పాల్గొన్న తెలుగు పిల్లలకు అభినందనలు. విజేతలయిన తమ పిల్లలను తానా సభలకు తీసుకు వస్తున్న తల్లితండ్రులకు కూడా అభినందనలు చెబుతూ, ఈ పోటీలు శనివారం, 6 జులై 2019 నాడు ఉదయం 9 గంటలనుంచి హాల్ 152 ఎ లో నిర్వహిస్తున్నారు. 11. 30 గంటలకు ముగింపు వేడుకలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్ లు ఇస్తారు. ఈ సమావేశానికి రాజ్యసభ మాజీ సభ్యులు డా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలుగు కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, రంగస్థల నటులు గుమ్మడి గోపాల కష్ణ, తానా అధ్యక్షులు సతీష్ వేమన. తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి వస్తున్నారు.
తెలుగు పిల్లలకున్న తెలుగు భాషా ప్రావీణ్యాన్ని గుర్తించటానికి, ప్రోత్సహించటానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.