తానా మహాసభలకు పద్మవిభూషణ్ సద్గురు రాక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా నిర్వహించనున్నది. జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ శ్రీ సద్గురు ను తానా మహాసభలకు రావాల్సిందిగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి గౌరవ అతిథిగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ఆయన మన్నించి 23వ మహాసభలకు గౌరవ అతిథిగా రావటానికి సమ్మతం తెలిపారు.
సద్గురు కోయంబత్తూరులో ఆదియోగి విగ్రహ ప్రాంగణలో ఈషా ఫౌండేషన్ ద్వారా ప్రపంచ దేశాల్లో పలు కార్యక్రమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకృతి పరిరక్షణ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్న నేపథ్యంలో తానా మహాసభలకు ఆయన రాక మరింత ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు.