తానా టీమ్‌స్క్వేర్ కు పాలడుగు శిరీష విరాళం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తన విభాగం టీమ్‌స్క్వేర్ ద్వారా అమెరికాలో ప్రమాదవశాత్తు, లేదా ప్రకృతి వైపరీత్యంతో మరణించిన తెలుగువాళ్ళ భౌతికకాయాలను వారి వారి స్వస్థలాలకు పంపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అమెరికా నుంచి మృతదేహాలను ఇండియాకు పంపినప్పటికీ అక్కడి నుంచి వారి స్వస్థలాలకు తీసుకువెళ్ళడానికి కొంత ఇబ్బంది కలుగుతోందని తానా టీమ్‌స్క్వేర్ చైర్మన్ అశోక్‌బాబు కొల్లా తెలిపారు. ఈ ఇబ్బందిని అధిగమించడానికి వీలుగా అంబులెన్స్‌లు కొనుగోలు చేయాలని అనుకున్నారు. అమెరికాలో ఉంటున్న శిరీష పాలడుగు అంబులెన్స్ కొనుగోలు నిమిత్తం దాదాపు 15వేల డాలర్ల చెక్కును అశోక్ కొల్లాకు విరాళంగా ఇచ్చింది. అంబులెన్స్ కొనుగోలుకు విరాళం ఇచ్చిన శిరీషను తానా నాయకులు, ఇతరులు అభినందించారు.
Tags :