యాదాద్రిలో వైభవంగా మహాకుంభ అభిషేకం
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో సప్తాహ్నిక పంచకుండాత్మక మహాకుంభ అభిషేకం మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. బాలాలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం 9 గంటలకు శాంతిపాఠం, అవధారయులు, చతుస్థానార్చనలు, ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, అగ్నిమథనం, అగ్నిప్రతిష్ట, యజ్జం, విశేషహవనాలు, మూలమంత్ర, మూర్తి మంత్రహవనాలు, నిత్యలఘు పూర్ణాహుతి కార్యక్రమాలను పాంచరాత్రాగమన శాస్త్రానుసారం నిర్వహించారు. మహాకుంభ సంప్రోక్షణలతో అగ్నిమథనం, అగ్నిప్రతిష్ఠ గావించారు.
మహాకుంభ సంప్రోక్షణాంగ భూతమైన పంచకుండత్మాక మహాయాగంలో విశేషమైన అధిష్టానదైవ సంబంధమైన మంత్రాలతో, మూలమంత్రాలతో దశాంశం, శతాంశ, సహస్రాంశాది తర్పములతో నృసింహుడిని స్త్రోత్రాలతో, బీజాక్షర ప్రయుక్త మంత్రాలతో విశేష హోమాలు నిర్వహించారు. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం ఈ వేడుక నిర్వహించారు. బాలాలయంలో సాయంత్రం 6 గంటలకు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, నిత్య విశేష హోమాలు చేశారు. ప్రధానాలయంలో బింబ పరీక్ష, మహోన్మాన శాంతిహోమం, నవ కలశ స్పపనం నిర్వహించారు. బాలాలయంలో నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించారు.