ASBL Koncept Ambience

రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓటమి

రెండు చోట్లా పవన్ కల్యాణ్ ఓటమి

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. బీఎస్పీ, వామపక్షాల మద్దతుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవన్‌కు ఈ ఎన్నికలు చేదు ఫలితాన్ని మిగిల్చాయి. ప్రశ్నిస్తా అంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్‌ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలవడంతో జనసేన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. భీమవరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో ఓటమి పాలైన జనసేనాని గాజువాకలో మూడో స్థానానికి పరిమితమై ఘోర పరాజయం పాలయ్యారు.

 

Tags :