ASBL Koncept Ambience

ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టొదు

ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టొదు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కేసీఆర్‌ వేలు పెట్టడం మంచిది కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సూచించారు. అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేసీఆర్‌ అండగా ఉంటారని వైఎస్‌ జగన్‌ చెబుతున్నారని, ఇదే విషయమై కేసీఆర్‌తో ఓ ప్రకటన ఇప్పించాలని కోరారు. ఏపీ రాజకీయాలను ఇక్కడి ప్రజలకే వదిలేయండి, ఇక్కడ ఎవరూ అధికారంలోకి రావాలో రాకుడతో ప్రజలు చూసుకుంటారని అన్నారు. ఏపీ రాజకీయాల్లోకి టీఆర్‌ఎస్‌ నిజంగా రావాలనుకుంటే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి పేరుతో అభ్యర్థులను నిలబెడితే సంతోషిస్తామని అన్నారు. అంతేతప్ప, దొడ్డిదోవన జగన్‌కు సహకరిస్తామంటే కుదరదని తెగేసి చెప్పారు. జగన్మోహన్‌ రెడ్డితో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు కానీ, వారి ఆలోచన విధానమే తనను ఇబ్బంది పెడుతోందని అన్నారు.

 

Tags :