తానా మహాసభలకు వస్తున్న పవన్ కళ్యాణ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభలు జూలై 4 నుంచి 6వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ మహాసభలకు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఈ మహాసభలకు అమెరికాలోని వాషింగ్టన్ డీసి కన్వెన్షన్ సెంటర్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు, సినీ కళాకారులు, రంగస్థల నటులు, నృత్యకళాకారిణులు, గాయనీగాయకులు, సాహితీవేత్తలు, బిజినెస్ ప్రముఖులు హాజరవుతున్నారని తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు.
Tags :