భక్తుల సందడిలో శ్రీరామనగరం
హైదరాబాద్‌లోని ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి భారీ విగ్రహాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు, సందర్శకులతో ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది తరలివచ్చారు. హైకోర్టు న్యాయమూర్తులు పోనగంటి నవీన్‌రావు, జస్టిస్ అభిషేక్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాజస్థాన్ పుష్కార్ జగద్గురు స్వామి రామచంద్రాచార్య మహారాజ్, బిహార్‌లోని గయకు చెందిన జగద్గురు శ్రీస్వామి వెంకటేశ ప్రపంచార్యాజీ మహారాజ్, సిక్కిం ఇక్ఫాయ్ యూనివర్సిటీ వీసీ జగన్నాథన్ పట్నాయక్ తదితరులు కూడా సమతామూర్తిని దర్శించుకున్నారు.
Tags :