తెలంగాణలో 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్న పిరమాల్ గ్రూప్
ప్రస్తుతం ఉన్న పిరమల్ ఫార్మా ను విస్తరించనున్న గ్రూప్. రానున్న మూడు సంవత్సరాల్లో 500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న గ్రూప్. ప్రస్తుతం తెలంగాణలో తనకున్న 14 వందల మంది ఉద్యోగులకు అదనంగా మరో ప్రత్యక్ష 600 ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పెట్టుబడితో అవకాశం కలుగుతుంది. వచ్చే నెల తెలంగాణలో పర్యటించనున్న పిరమాల్ గ్రూప్ సీనియర్ ప్రతినిధి బృందం.
దావోస్లో మంత్రి కేటీఆర్ తో సమావేశం అయిన పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్. మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం ఈ భారీ పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకున్న గ్రూపు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాలసీల నేపథ్యంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లను హైదరాబాద్ కి తరలించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపిన గ్రూప్.
Tags :