నాకోసం మీరిది చేయగలరా? మోదీ
కనీసం ఐదు ప్రవాస భారతీయ కుటుంబాలను టూరిస్టులుగా ఏటా భారత దేశానికి పంపాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో నివసిస్తున్న ప్రవాస భారతీయులను కోరారు. భారతీయ సమాజ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నాకోసం మీరిది చేయగలరా? నాది చాలా చిన్న కోరిక అని ఆయన అభ్యర్థించారు. గాంధీ మ్యూజియం వేడుకల్లో శిలాఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అలాగే హ్యూస్టన్‌లోని గుజరాత్ సమాజ్ ఈవెంట్ సెంటర్‌ను, సిద్ధివినాయక్ ఆలయాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల తరువాత ఆయన భారతీయ సమాజాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. గాంధీ మ్యూజియం హ్యూస్టన్‌లో సాంస్కృతిక చిహ్న బహుమానం అందిస్తుందని, యువతరంలో గాంధీ ఆలోచనలను ప్రాచుర్యం చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. భారత అమెరికా సంబంధాల ఉజ్వల భవిష్యత్తుకు హ్యూస్టన్‌లో వేదికను ఏర్పాటు చేసినందుకు భారతీయ సమాజానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.