ASBL Koncept Ambience

న్యూయార్క్‌ చేరిన మోదీ

న్యూయార్క్‌ చేరిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్‌ చేరుకున్నారు. 74వ ఐరాస సాధారణసభ సమావేశాల్లో పాల్గొనేందుకు హ్యూస్టన్‌ నుంచి నేరుగా జేఎఫ్‌కే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. రానున్న నాలుగు రోజులు విస్తృత కార్యక్రమాలతో బిజీబిజీగా గడపనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సహా, పలువురు ప్రపంచ అధినేతలతో సమావేశం అవుతారు. వాతవరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి, సార్వజనీన ఆరోగ్యం తదితర అంశాలపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ తెలిపారు. అంతర్జాతీయ చర్చావేదికపై భారత్‌ గొంతుకను వినిపిస్తారని పేర్కొన్నారు. మోదీతో వివిధ దేశాలకు చెందిన 75 మంది ప్రతినిధులు, విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు.

 

 

Tags :