ASBL Koncept Ambience

కమలాహారిస్, టిమ్‌కుక్‌తో భేటీ కానున్న మోదీ

కమలాహారిస్,  టిమ్‌కుక్‌తో  భేటీ కానున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అధ్యక్షుడు జో బైడెన్‌ అతిధ్యంలో జరగనున్న క్యాడ్‌ నేతల సదస్సులో పాల్గొననున్నారు. అలాగే అమెరికా ఉపాధ్యాక్షురాలు, భారత సంతతి మహిళ కమలాహారిస్‌, ప్రముఖ టెక్‌ దిగ్గజయం యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం. మోదీ సెప్టెంబర్‌ 22న అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాతి రోజు అక్కడ పలు ప్రముఖ సంస్థలకు చెందిన సిఈఓలతో సమావేశం కానున్నారు. వారిలో టిమ్‌ కుక్‌ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే కమలా హారిస్‌తోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అదేరోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌,  జపనీస్‌ ప్రధాని యోషియిడే సుగాతో సమావేశం కానున్నారు.

 

Tags :