అమెరికా సీఈవోలతో ప్రధాని మోదీ భేటీ
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంపెనీ సీఈవోలు (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)లతో సమావేశమయ్యారు. భారత్‌లో విస్తృత అవకాశాలను వివరిస్తూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వారిని కోరారు. వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో క్రిస్టియానో అమోన్ (క్వాల్కామ్), అడోబ్, మార్క్ విడ్మర్ (ఫస్ట్ సోలార్), వివేక్ లాల్ (జనరల్ ఆటోమేటిక్స్), స్టీఫెన్ ఏ స్క్వార్జ్‌మన్ (బ్లాక్‌స్టోన్) కంపెనీ సీఈవోలతో ప్రధాని భేటీ అయ్యారు. మోదీ ఒకరి తర్వాత ఒకరితో భేటీ అయ్యారు. 5జీ, ఇతర డిజిటల్ ఇండియా కృషిలో భారత్‌తో కలిసి కృషి చేసేందుకు క్వాల్కామ్, ఫస్ట్ సోలార్ సంస్థల సీఈవోలు ఆసక్తి వ్యక్తం చేశారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. భారత్‌లో అడోబి కార్యకలాపాలు, భవిష్యుత్తు ప్రణాళికలపై శంతనుతో ప్రధాని చర్చించారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ పేర్కొన్నారు. సీఈవోలతో భేటీ అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో ప్రధాని భేటీ అయ్యారు.