ASBL Koncept Ambience

తెలుగు సినిమాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంస

తెలుగు సినిమాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంస

తెలుగుసినిమాపైప్రధానమంత్రి నరేం ద్రమోదీ ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందన్నారు. 216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా సిల్వర్‌ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. 

'సిల్కర్‌ స్కీన్‌ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. తెలుగు భాష చరిత్ర ఎంతో సుసంపన్నమైంది. కాకతీయుల రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణం. పోచంపల్లి చేనేత వస్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాయి' అంటూ ప్రశం​సల జల్లు కురిపించారు. ప్రస్తుతం మోదీ చేసిన ఈ కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

 

Tags :